‘అన్నాత్త’ తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ ఎవరికంటే..?

సూపర్ స్టార్ రజనీకాంత్, నయతార జంటగా సన్ పిక్చర్స్ బ్యానర్‌పై శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘అన్నాత్త’. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఈ చిత్ర తెలుగు మరియు తమిళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ఏషియన్ సినిమాస్ నారాయణదాస్ నారంగ్ మరియు దగ్గుబాటి సురేష్ బాబు సొంతం చేసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకాబోతోంది. కీర్తి సురేశ్, ఖుష్బూ సుందర్, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రజినీ నెవర్ బిఫోర్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్ర టీజర్ అక్టోబర్ 14న విడుదల కానుంది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.