‘అటువంటి సీన్స్‌‌’ చేస్తే నా భర్త బాధపడతాడు.. అందుకే వాటికి నో చెబుతున్నానంటోన్న నటి..

ABN , First Publish Date - 2022-01-29T02:03:06+05:30 IST

హిందీలో సీరియల్స్‌తో పాటు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న అందాల రాశి అంకిత లోఖండే. గతంలో ‘పవిత్ర రిష్తా’

‘అటువంటి సీన్స్‌‌’ చేస్తే నా భర్త బాధపడతాడు.. అందుకే వాటికి నో చెబుతున్నానంటోన్న నటి..

హిందీలో సీరియల్స్‌తో పాటు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న అందాల రాశి అంకిత లోఖండే. గతంలో ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ సరసన ఆమె నటించింది. ఈ సిరీయల్ రెండో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. అందువల్ల ఆమె పతాక శీర్షికలకెక్కింది. అంకిత లోఖండే తన ప్రియుడు విక్కీ జైన్‌ను కొన్నాళ్ల క్రితం పెళ్లాడింది. వివాహాం అనంతరం బోల్డ్ సీన్స్ చేయడానికి అంకిత ససేమిరా అంటోంది. నిజానికి కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కూడా తనకు అటువంటి సీన్స్ చేయడం ఇష్టం లేదని ఆమె తెలుపుతోంది. 


తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పలు విషయాలను అభిమానులకు తెలిపింది. ‘‘నేను కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా ఉంటాను. అది నా ఛాయిస్. నా మనస్సును ఎవరూ మార్చలేరు. బోల్డ్ సీన్స్‌లో నటించ కూడదని నేను నిర్ణయించుకున్నాను. నా భర్త విక్కీ జైన్ ఇబ్బంది పడకూడదని నేను భావిస్తున్నాను.  అతడి భావోద్వేగాలను కూడా నేను అర్థం చేసుకోవాలి. బోల్డ్ ప్రాజెక్టుల్లో నటించడం వల్ల మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తవు. కానీ, నా భర్త బాధ పడితే చూడటం నాకు ఇష్టం లేదు. అందువల్ల అటువంటి సీన్స్‌లో నేను నటించబోను’’ అని అంకిత లోఖండే చెప్పింది.

Updated Date - 2022-01-29T02:03:06+05:30 IST