క్రేజీ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన అంజ‌లి..!

ABN , First Publish Date - 2021-08-18T14:52:32+05:30 IST

ఇటు తెలుగు, అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన హీరోయిన్ అంజ‌లి ఓ క్రేజీ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకెళ్తే..

క్రేజీ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన అంజ‌లి..!

ఇటు తెలుగు, అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన హీరోయిన్ అంజ‌లి ఓ క్రేజీ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. ఈ ఏడాది ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ వ‌కీల్‌సాబ్‌లో న‌టించిన అంజ‌లి, ఇప్పుడు మ‌రో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ చిత్రంలో న‌టించ‌బోతుంద‌ట‌. చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. దిల్‌రాజు, శిరీశ్ నిర్మించ‌నున్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఓ కీల‌క పాత్ర కోసం మేక‌ర్స్ అంజ‌లిని సంప్ర‌దించార‌ట‌. త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉండ‌టం, మంచి రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేయ‌డంతో అంజ‌లి కూడా ఓకే అంద‌ని అన్న‌ట్లు న్యూస్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై అంజ‌లి ఏమంటుందో చూడాలి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో చ‌ర‌ణ్ క‌నిపిస్తార‌ని టాక్‌. 

Updated Date - 2021-08-18T14:52:32+05:30 IST