ఈ మధ్య చాలామందిని కొడుతున్నా: అంజలి!

ABN , First Publish Date - 2022-01-20T20:03:56+05:30 IST

తెలుగమ్మాయి అంజలి కథల ఎంపికలో అచితూచి అడుగేస్తుంటారు. తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో కూడా ఆమె రాణిస్తున్నారు. గత ఏడాది అంజలి ‘ఝాన్సీ’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ చేశారు. తిరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ కథ కోసం అంజలి పలు పోరాటాలు నేర్చుకున్నారు.

ఈ మధ్య చాలామందిని కొడుతున్నా: అంజలి!

తెలుగమ్మాయి అంజలి కథల ఎంపికలో అచితూచి అడుగేస్తుంటారు. తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో కూడా ఆమె రాణిస్తున్నారు. గత ఏడాది అంజలి ‘ఝాన్సీ’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ చేశారు. తిరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ కథ కోసం అంజలి పలు పోరాటాలు నేర్చుకున్నారు.  దానితో యాక్షన్‌పై మంచి పట్టు పెరిగిందని ఆమె తెలిపారు. సెట్‌లో కాస్త ఎక్కువ చేతినవారిపై కూడా అంజలి చేయి చేసుకునేదట. ఈ విషయాన్ని ఆమె ఓ వేదికపై తెలిపారు. ‘ఝాన్సీ’ కోసం యాక్షన్‌ సీన్స్‌ నేర్చుకున్నా. ఈ మధ్యన సెట్‌లో అందరినీ కొడుతున్నా. సో నాకు అందరూ భయపడుతున్నారు’ అని అంజలి తెలిపారు. ప్రస్తుతం ఆమె ‘భీష్మపర్వం’, ‘ఎఫ్‌3’, ‘భైరాగి’, చిత్రాల్లో నటిస్తున్నారు. 


Updated Date - 2022-01-20T20:03:56+05:30 IST