‘యానిమల్’ విడుదల తేదీ ఖరారు!
ABN , First Publish Date - 2021-11-20T03:03:57+05:30 IST
‘అర్జున్‌రెడ్డి’ ఫేం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. 2023లో ఆగస్టు 11న ఈ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయనున్నారు.

‘అర్జున్‌రెడ్డి’ ఫేం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. 2023లో ఆగస్టు 11న ఈ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయనున్నారు. మొదట వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేయలనుకున్నారు. పలు కారణాల వల్ల వాయిదా పడింది. రోజుల్ని బట్టి మారుతున్న మనిషి స్వభావాల ఇతివృత్తంగా సాగే కథ ఇది. ప్రకృతిలో ఓ కథానాయకుడు జంతువులా ఎలా మారాడనే ఆసక్తికర అంశాల సమాహారమే ఈ సినిమా. ఇందులో రణ్‌బీర్ సరసన హీరోయిన్‌గా పరిణీతి చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. విలన్‌గా బాబీ డియోల్, మరో పాత్రలో అనిల్ కపూర్ కనిపించనున్నారు. భూషణ్‌కుమార్, భద్రకాళీ పిక్చర్స్, సినీ స్టూడియోస్ వన్’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.