Shekar: అందుకే చాలా టెన్షన్‪గా ఉందంటోన్న రాజశేఖర్

ABN , First Publish Date - 2022-05-20T02:56:47+05:30 IST

యంగ్రీ మాన్ రాజశేఖర్ హీరోగా నటించిన 91వ చిత్రం ‘శేఖర్’ (Shekar). జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) దర్శకత్వంతో పాటు స్క్రీన్‪ప్లే అందించిన ఈ చిత్రాన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో.. పెగాసస్ సినీకార్ప్

Shekar: అందుకే చాలా టెన్షన్‪గా ఉందంటోన్న రాజశేఖర్

యంగ్రీ మాన్ రాజశేఖర్ హీరోగా నటించిన 91వ చిత్రం ‘శేఖర్’ (Shekar). జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) దర్శకత్వంతో పాటు స్క్రీన్‪ప్లే అందించిన ఈ చిత్రాన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో.. పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి (Beeram Sudhakara Reddy), శివాని రాజశేఖర్ (Shivani Rajashekar), శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar), వెంకట శ్రీనివాస్ బొగ్గరం (Boggaram Venkata Srinivas) నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.


ఆయన మాట్లాడుతూ..

‘‘కోవిడ్‌ టైమ్‌లో దాదాపు డెత్ వరకు వెళ్లి వచ్చాను. ఇక జీవితం అయిపోయింది.. సినిమాలు కూడా చేయలేను అనుకున్నా. కానీ నా కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన సపోర్ట్‪తో మళ్లీ కోలుకున్నా. మళ్లీ అన్నీ నేర్చుకుని ‘శేఖర్‌’ చిత్రంలో నటించాను. ఈ సినిమా మా ఫ్యామిలీ మొత్తానికి చాలా స్పెషల్. ఎందుకంటే, ఇప్పటి వరకు మా వెనక కొన్ని ఆస్తులు ఉన్నాయి.. కాబట్టి సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. పెద్దగా బాధ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు శేఖర్‌ సినిమా సక్సెస్‌ అయితేనే.. ఇప్పుడున్న అప్పుల నుండి బయటపడతాం. లేదంటే అప్పుల పాలవుతాం. అందుకే చాలా టెన్షన్‪గా ఉంది. 


ఒక డిఫరెంట్ ప్రయత్నం చేశాం.. సినిమా చూసి బాగుంటే.. చూసిన వారు మరో పదిమందికి చెప్పండి. సినిమా బాగుందని తెలిస్తేనే.. థియేటర్స్‌ వెళ్లి చూడండి. కానీ త్వరగా వచ్చి చూడండి. ఈ టెన్షన్స్‌ కారణంగానే ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియడం లేదు. అందుకే ప్రీ రిలీజ్ వేడుకలో సినిమాను బతికించండి అని అన్నాను. ఈ సినిమాలో చేసిన పాత్రతో చాలా సంతృప్తిగా ఉన్నాను. శేఖర్‌ క్యారెక్టర్‌లో ఉన్న ఎమోషన్‌, బాధను చూపించడానికి బాగా కష్టపడ్డాను.55-60 ఏళ్ల వయసు ఉన్న క్యారెక్టర్‌ నాది. ఈ క్యారెక్టర్‌కి కొత్త లుక్‌ ఉంటే.. సినిమాకు ప్లస్‌ అవుతుందని ఆలోచించి.. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌ ట్రై చేశాం. ఆ గెటప్‌ బాగుందని చాలా మంది చెప్పారు. అయినా కొంచెం భయం ఉండేది. ట్రైలర్‌ విడుదల తర్వాత.. వస్తున్న స్పందన చూసి కాస్త ధైర్యం వచ్చింది. సినిమా చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు కూడా మెచ్చుకున్నారని జీవిత చెప్పారు. దీంతో నాకు ఇంకాస్త ధైర్యం వచ్చింది. ఇక ప్రేక్షకుల స్పందన వస్తే గానీ.. పూర్తి స్థాయిలో ధైర్యం వస్తుంది.


జీవిత మంచి దర్శకురాలు. నటీనటుల నుండి తనకు ఏం కావాలో అది రాబట్టుకుంటుంది. నేను చేసిన ‘తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, మగాడు, సింహరాశి..’ వంటి రీమేక్ సినిమాలన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయి. అందుకే ‘జోసెఫ్‌’ మూవీ ఎంచుకున్నాం. మలయాళంలో ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. రీమేక్‌లకు సక్సెస్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ‘జోసెఫ్‌’ చిత్రాని సెలెక్ట్‌ చేశాం. మొదట ఈ చిత్రంలో కూతురి పాత్రలకు శివాని, శివాత్మికలను కాకుండా వేరే వాళ్లను తీసుకుందామని అనుకున్నాం. ఈ విషయం జీవితతో చెబితే.. లేదండి..మన ఇద్దరి కూతుళ్లలో ఎవరినో ఒకరిని పెడితే..ఆడియన్స్‌ ఈజీగా కనెక్ట్‌ అవుతారు. మీ కూతురు అని చెప్పడానికి ఎక్కువ సీన్స్‌ పెట్టాల్సిన అవసరం ఉండదు. చూడడానికి బాగుంటుంది అని చెప్పింది. నేను కూడా ఏకీభవించాను. ఇద్దరిలో ఎవరు చేస్తారని అడిగితే.. ఇద్దరూ చేస్తామని చెప్పారు. చివరకు అక్క కోసం శివాత్మిక త్యాగం చేసింది. 


ఈ చిత్రం డబ్బింగ్ విషయానికి వస్తే.. 10 సంవత్సరాల తర్వాత మళ్లీ సాయికుమార్‌ నాకు ఈ చిత్రంలో డబ్బింగ్‌ చెప్పారు. పదేళ్లుగా శ్రీనివాస్‌ మూర్తి నా పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నారు. ఇద్దరూ చాలా బాగా చెప్పారు. 37 ఏళ్ల నా సినీ కెరీర్‌లో 27 ఏళ్లు సాయికుమార్‌, 10 ఏళ్లు శ్రీనివాస్‌ మూర్తి నా పాత్రలకు డబ్బింగ్‌ చెప్పారు. అనూప్‌ రూబెన్స్‌ ఇచ్చిన సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. మ్యూజిక్‪తో తను మ్యాజిక్  చేశాడు. 


కోవిడ్‌ టైమ్‌లో.. నా ఇద్దరు కూతుళ్లు కంటికి రెప్పలా చూసుకున్నారు. కొడుకులు తక్కువ అని నేను చెప్పను కానీ.. కూతుళ్లు మాత్రం ఎక్కువే. భవిష్యత్తులో తప్పుకుండా  మా ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చేస్తాం. త్వరలోనే ఓ భారీ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది. పాన్‌ ఇండియా మూవీకి ప్లాన్‌ చేస్తున్నాం. ఆ వివరాలన్నీ త్వరలోనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి.. సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను..’’ అని అన్నారు.

Updated Date - 2022-05-20T02:56:47+05:30 IST