AP సర్కారువారి సినిమాకు బ్రేకులు పడ్డాయి

ABN , First Publish Date - 2022-07-01T18:19:40+05:30 IST

సినిమా టికెట్లు మేమే అమ్ముతాం.. మా దగ్గరే కొనాలంటూ ఏపీ సర్కారు సరికొత్త విధానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సినిమా టిక్కెట్లన్నీ ఆన్ లైన్ లోనే అమ్మాలని, రాష్ట్ర ప్రభుత్వం జీవో 69 (GO No. 69) ను జారిచేసింది.

AP సర్కారువారి సినిమాకు బ్రేకులు పడ్డాయి

సినిమా టికెట్లు మేమే అమ్ముతాం.. మా దగ్గరే కొనాలంటూ ఏపీ సర్కారు సరికొత్త విధానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సినిమా టిక్కెట్లన్నీ ఆన్ లైన్ లోనే అమ్మాలని, రాష్ట్ర ప్రభుత్వం జీవో 69 (GO No. 69) ను జారిచేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హై కోర్ట్ లో బక్ మై షో (Book Myshow), మల్టీప్లెక్స్ విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ పిటీషన్లు దాఖలు చేశారు. రెండు రోజుల పాటు వాదనలు విన్న హైకోర్ట్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ పోర్టల్‌ను పలు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా సరే సర్కారు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో కొంతమంది హైకోర్ట్ ను ఆశ్రయించారు. దీనిపై పలు విడతల విచారణ అనంతరం హైకోర్ట్ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నెం. 69ను హైకోర్ట్ నిలిపివేసింది. దీనిపై తదనంతర చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేసింది. ఈ కేసును ఈ నెల 27వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది. 


ఆన్ లైన్ లో టిక్కెట్ల అమ్మకం తర్వాత వచ్చిన ఆదాయాన్ని తిరిగి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు ఇచ్చే విషయంలో స్పష్టతలేకపోవడంతో దీనిపై నిర్మాతల మండలి ప్రభుత్వానికి లేఖలు రాసింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో జీవోనెం.69ను సవాల్ చేస్తూ.. మల్టీప్లెక్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ప్రైవేట్ ఆన్ లైన్ విక్రయ సంస్థలు హైకోర్ట్ లో పిటీషన్స్ దాఖలు చేశాయి. ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వం, ఇటు పిటీషన్స్ దాఖలు చేసిన వారి తరపు న్యాయవాదుల వాదనను విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసి జూలై 1న ప్రకటిస్తామని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2022-07-01T18:19:40+05:30 IST