MAA : పోటీలో ఉన్నా ఓటేయడానికి రాని Anchor Anasuya!

ABN , First Publish Date - 2021-10-10T19:48:47+05:30 IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వింత విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి...

MAA : పోటీలో ఉన్నా ఓటేయడానికి రాని Anchor Anasuya!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వింత విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. రీల్ లైఫ్‌లో యాక్టింగ్ చేసి ఫైట్స్ చేసిన హీరోలు, విలన్లు ఇప్పుడు ‘మా’ ఎన్నికలు వచ్చేసరికి రియల్ లైఫ్‌లో నటించేస్తున్నారు. మరోవైపు ఓటేయడానికి ప్రముఖులెవరూ ముందుకు రావట్లేదు. సుమారు 900కు పైగా ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకూ 490 మాత్రమే పోలవ్వడం గమనార్హం. అయితే గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం కాస్త ఓటింగ్ శాతం మాత్రం పెరిగిందని చెప్పుకోవచ్చు.


ఎందుకు రాలేదో..!?

యాంకర్, నటి అనసూయ మా ఎన్నికల బరిలో ఉన్న విషయం విదితమే. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పోటీ చేశారు. అయితే అనసూయ ఇంతవరకూ ఓటేయడానికి రాలేదు. ఇంతకీ ఆమె ఏమయ్యారు..? ఓటేయడానికి ఎందుకు రాలేదు..? పోటీలో ఉండి ఓటేయకపోవడమేంటి..? అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. మంచు ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉండే అనసూయ ఆ కుటుంబంతో వారికి వ్యతిరేకంగా పోటీకి దిగడం ఇష్టం లేకనే ఇలా ఓటేయడానికి రాలేదనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. మరి ఇప్పుడైనా అనసూయ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారో లేదో చూడాలి. కాగా.. క్యూలో దాదాపు మరో 150 మంది నటీనటులున్నారని తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 50 నుంచి 60 మంది ఓటు వేశారని సమాచారం.

Updated Date - 2021-10-10T19:48:47+05:30 IST