Anasuya: స్పెషల్ నంబర్‌లో మరోసారి ?

బుల్లితెర క్రేజీ యాంకర్ కమ్ నటి అనసూయ మరోసారి స్పెషల్ నంబర్‌తో అలరించబోతోందని వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాస్ మహా రాజా రవితేజ, త్రినాధ్ రావ్ నక్కిన దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కబోతోంది. కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయింది. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్‌లో అనసూయ మాస్ మహారాజాతో కలిసి స్టెప్పులేయబోతోందని తెలుస్తోంది. అయితే, మేకర్స్ నుంచి ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా అనసూయ ఇప్పటికే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం రవితేజ.. రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి', శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు' సినిమాలు చేస్తున్నాడు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.