Anasuya: స్టార్‌ హీరోలను ఎందుకు ప్రశ్నించరు?

ABN , First Publish Date - 2021-10-19T07:27:13+05:30 IST

బుల్లితెర హాట్‌ యాంకర్‌ అనసూయపై సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే! ఆమె మంచి నటి అనీ, అందంగా ఉంటుందనీ, కానీ ఆమె వస్త్రధారణ తనకు నచ్చదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై పేరు చెప్పకుండా ఫైర్‌ అయ్యారు. ఎవరికి ఇష్టమొచ్చిన దుస్తులు వారు ధరిస్తారు. అది వ్యక్తిగతమని అనసూయ మండిపడ్డారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ చేశారు.

Anasuya: స్టార్‌ హీరోలను ఎందుకు ప్రశ్నించరు?

బుల్లితెర హాట్‌ యాంకర్‌ అనసూయపై సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే! ఆమె మంచి నటి అనీ, అందంగా ఉంటుందనీ,   కానీ ఆమె వస్త్రధారణ తనకు నచ్చదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై పేరు  చెప్పకుండా ఫైర్‌ అయ్యారు. ఎవరికి ఇష్టమొచ్చిన దుస్తులు వారు ధరిస్తారు. అది వ్యక్తిగతమని అనసూయ మండిపడ్డారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ చేశారు. ‘నా వస్త్రధారణ గురించి ఓ సీనియర్‌ యాక్టర్‌ చేసిన కామెంట్లని ఇప్పుడే చూశా. నటుడి అపారమైన అనుభవం ఉన్న ఆయన అలా మాట్లాడం బాధ కలిగించింది. దుస్తులు ధరించడం అనేది వ్యక్తిగత అంశం. ఒక్కోసారి వృత్తిపరంగానూ విభిన్న  దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సోషల్‌ మీడియా అనవసరమైన విషయాల్ని గొప్పగా చూపిస్తోంది. అదే మీడియా ఆ సీనియర్‌ నటుడు మద్యం ేసవిస్తారనీ, చిరిగిన బట్టలు తొడుక్కుంటారని, ఆన్‌స్ర్కీన్‌ మహిళల్ని కించపరిచే విధంగా పవర్తిస్తారని చెప్పకపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయం! పెళ్లై పిల్లలున్న స్టార్‌లు హీరోయిన్లతో ఆన్‌స్ర్కీన్‌ రొమాన్స్‌ చేస్తుంటే దాని గురించి ఎవరూ ప్రశ్నించరెందుకు? చొక్కా లేకుండా తమ శరీరాన్ని చూపిస్తుంటే నోరు ఎందుకు మెదపరు? పెళ్లై,  ఇద్దరు పిల్లలుండి, చేసే పనిలో సక్సెస్‌ వెతుక్కుంటున్న నాలాంటి వారిపై ఎందుకు ఈ కామెంట్స్‌’’ అని ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. 




Updated Date - 2021-10-19T07:27:13+05:30 IST