ఎయిర్ హోస్టెస్‌గా అనసూయ..?

ABN , First Publish Date - 2021-07-31T16:36:14+05:30 IST

బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరో ఛాలెంజింగ్ రోల్‌లో నటించబోతోందని తాజాగా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది.

ఎయిర్ హోస్టెస్‌గా అనసూయ..?

బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరో ఛాలెంజింగ్ రోల్‌లో నటించబోతోందని తాజాగా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది. 'పేపర్ బాయ్', 'విటమిన్-షి' సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్. ఆయన ఓ ఆంథాలజీ మూవీని తెరకెక్కించనున్నాడు. ఇదీ 6 కథల సమ్మేళనం ఉంటుందట. ప్రతి కథలో ఒక ప్రముఖ నటీనటులు లీడ్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అనసూయ కూడా ఓ కథలో లీడ్ రోల్ పోషిస్తుందని, ఆ రోల్ ఎయిర్ హోస్‌గా అని సమాచారం. ఆగస్టు నుంచి ఈ సినిమా చిత్రీకరణలో అనసూయ జాయిన్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇక కృష్ణంవంశీ తెరకెక్కిస్తున్న 'రంగ మార్తాండ', రవితేజ 'ఖిలాడి', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్‌ల పాన్ ఇండియన్ మూవీ 'పుష్ప' లలో నటిస్తోంది. 

Updated Date - 2021-07-31T16:36:14+05:30 IST