Ananya Panday : 4 దక్షిణాది భాషాల్లోకి ఒకేసారి... భయంగా ఉంది!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ‘లైగర్’ మూవీతో జనం ముందుకొచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఓ వైపు, కరోనా కేసుల కలకలంతో అనేక సినిమాల విడుదల వాయిదా పడుతున్నప్పటికీ విజయ్ దేవరకొండ స్టారర్ గురించి బీ-టౌన్‌లో చర్చ అయితే బాగానే సాగుతోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న ‘లైగర్‌’తో మన రౌడీ స్టార్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుండగా... హీరోయిన్ అనన్య పాండే మొత్తం దక్షిణాది భాషలన్నిట్లోనూ కుడి కాలు మోపబోతోంది!


‘‘నాలుగు కొత్త సినీ పరిశ్రమల్లోకి ప్రవేశించటం భయంగా ఉంది. అయితే, సూపర్ ఎగ్జైటింగ్ కూడా ఉంది’’ అంటోంది ‘లైగర్’ లేడీ అనన్య. తొలిసారి విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన క్యూట్ ముంబై బేబీ పూరీ జగన్నాథ్ ఫిల్మ్‌తో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ప్రేక్షకులకి పరిచయం కానుంది. అనన్య ఇంత వరకూ హిందీ సినిమాలు మాత్రమే చేసింది. ‘లైగర్’ ఆమె కెరీర్‌లో ఫస్ట్ ప్యాన్‌ ఇండియా మూవీ. 


‘ఔట్ అండ్ ఔట్ మసాలా’ ఫిల్మ్ అంటూ ‘లైగర్’ని డిఫైన్ చేసిన అనన్య తన సౌత్ డెబ్యూ మూవీకి ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయోనని ఉద్విగ్నంగా ఎదురు చూస్తోందట. చూడాలి మరి, స్లిమ్ అండ్ సెక్సీ అనన్యకి దక్షిణాది కుర్రాళ్లు ఎలాంటి గ్రాండ్ వెల్కమ్ చెబుతారో...  

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.