'లైగర్ (Liger) మాంచి మసలా సినిమా'.. అని తెలిపింది చిత్ర హీరోయిన్ అనన్య పాండే (Ananya Pandey). చాలాకాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) సినిమాతో భారీ మాస్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath). ఈ సినిమా సక్సెస్ పూరిని మళ్ళీ ఫాంలోకి తీసుకొచ్చింది. అంతే, ఇక డబుల్ ఎనర్జీతో పూరి తన మార్క్ చూపిస్తూ లైగర్ సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ మూవీలో జంటగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న లైగర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది.
ఈ నేపథ్యంలో హీరోయిన్ అనన్య పాండే తాజాగా బాలీవుడ్‌లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లైగర్ సినిమా గురించి, హీరో విజయ్ దేవకొండ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'విజయ్ దేవరకొండది ఎంతో దయాగుణము'. అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, 'తను అద్భుతమైన వ్యక్తి.. అమెరికాలో షూటింగ్ చేసిన సమయంలో చాలా సరదాగా గడిపాము'.. అని మెమరీస్‌ను గుర్తు చేసుకుంది. ఇక 'ఈ సినిమాకు సంబంధించి దాదాపు అన్నీ కార్యక్రమాలు పూర్తయ్యాయి, నా డబ్బింగ్ పార్ట్ కూడా అయిపోయింది'.. అని అప్‌డేట్ ఇచ్చింది అనన్య.
ఈ ఆగస్టులో మూవీ రిలీజ్ అవుతుందని..లైగర్ మాంచి మసాలా సినిమా అని చెప్పి అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. 'పూరీ మార్క్‌తో రాబోతున్న లైగర్ సినిమాను చూసి అభిమానులు ఆనందిస్తారు'.. అని చాలా నమ్మకంగా చెప్పుకొచ్చింది. కాగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. తెలుగు, హిందీ భాషలతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలకానుంది. ఇక లైగర్ సినిమా విజయ్‌కి బాలీవుడ్ మొదటి సినిమా కాగా, అనన్య పాండేకి కూడా సౌత్ ఎంట్రీ కావడం విశేషం. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జొహార్ కలిసి నిర్మిస్తున్నారు.