ananya panday విజయ్ దేవరకొండ కొత్త హీరోయిన్ ఇంట్లో విషాదం

ABN , First Publish Date - 2021-07-11T13:08:48+05:30 IST

బాలీవుడ్ భామ, విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘లైగర్’ హీరోయిన్...

ananya panday విజయ్ దేవరకొండ కొత్త హీరోయిన్ ఇంట్లో విషాదం

ananya panday బాలీవుడ్ భామ, విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండే ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె నాన్నమ్మ కన్నుమూశారు. ఈ నేపధ్యంలో అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.


ఈ కార్యక్రమాల్లో అనన్య పాల్గొన్నారు. అనన్య తండ్రి చంకీ పాండే అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. తన తల్లి స్నేహలతా పాండేకు చంకీ పాండే తలకొరివి పెట్టారు. ఈ కార్యక్రమాలకు బాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు హాజరయ్యారు. కాగా అనన్యపాండేకు తన నాన్నమ్మతో ఎంతో అనుబంధం ఉంది. ఇటీవలే అనన్య తన నాన్నమ్మ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Updated Date - 2021-07-11T13:08:48+05:30 IST