ఇంట్రెస్ట్రింగ్‌గా ఆనంద్ దేవరకొండ 'హైవే'
ABN , First Publish Date - 2022-01-01T18:36:55+05:30 IST
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హైవే'. తాజాగా మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. కేవీ గుహన్ దర్శకత్వంలో సైకో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హైవే'. తాజాగా మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. కేవీ గుహన్ దర్శకత్వంలో సైకో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ఈ చిత్రాన్ని నిర్మాత వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. నూతన సంవత్సరం కానుకగా 'హైవే' చిత్రం నుంచి మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో ఆనంద్ దేవరకొండతో పాటు హీరోయిన్ మాసన, ఇతర ప్రధాన తారాగణం ఉన్నారు. సీరియస్ లుక్‌లో ఆనంద్ చాలా ఇంటెన్సివ్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ యంగ్ హీరో కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో వచ్చి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సైకో క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. మరి ఈ 'హైవే' ఆనంద్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్‌ను ఇస్తుందో చూడాలి.