కొరియన్ వెబ్‌సిరీస్‌లో పాకిస్థానీ పాత్ర చేసిన భారతీయుడు.. అదెలా జరిగిందో చెప్పిన నటుడు

గత నెలలో విడుదలైన కొరియన్ వెబ్‌సిరీస్ ‘స్వ్కిడ్ గేమ్’ ఎంత మంచి టాక్ తెచ్చుకుందో అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చాలా భాషల్లోకి డబ్ అయిన ఈ సిరీస్ ప్రతి చోట మంచి పేరునే సంపాదించింది.


అయితే ఈ సర్వైవల్ డ్రామాలో సిరీస్ మంచి పేరు సంపాదించిన పాత్రల్లో ఆలీ అబ్దుల్ పాత్ర ఒకటి. ఎంతో నమ్మకంగా ఉండే పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ వలస కార్మికుడి పాత్ర అది. అయితే ఆ క్యారెక్టర్ నటించింది మాత్రం ఓ భారతీయుడు. ఆయనే ఢిల్లీకి చెందిన అనుపమ్ త్రిపాఠి.


ఓ ఇంటర్వ్యూలో ఈ పాత్ర గురించి మాట్లాడాడు అనపమ్. అందులో.. ‘తాను ఎన్ని సమస్యల్లో ఉన్న నమ్మిన వారిని రక్షించే పాత్ర ఇదని డైరెక్టర్ చెప్పారు. ఎవరైనా సరే ఇతన్ని సొంతవాడిలా అనుకుంటారని తెలిపారు. అందుకే ఈ పాత్ర కోసం 6 కేజీల బరువుపెరిగాన’ని చెప్పాడు.


గేమ్‌లో ప్రధాన పాత్ర చేస్తున్న సియోన్ గిహున్‌ని కాపాడతాడు అనుపమ్. అయితే ఈ సీన్ షోలో మంచి హీరోయిక్‌గా వచ్చింది. అయితే అంతలా అందరిని ఆకట్టకునేలా ఉంటుందని తనకి తెలియదని ఈ నటుడు తెలిపాడు.

ఢిల్లీలో పుట్టి పెరిగిన అనుపమ్ అక్కడ ఐదేళ్లు థియేటర్స్‌లో చేశాడు. అప్పడు ఆయనకి ఆర్ట్స్ మేజర్ ఆసియన్ స్కాలర్‌షిప్ రావడంతో కొరియా ఆర్ట్స్ జాతీయ విశ్వవిద్యాలయంలో చదివేందుకు 2010లో వెళ్లాడు. అనంతరం అక్కడే ఉంటూ ‘డిసెంట్ ఆఫ్ ది సన్’, ‘హస్పిటల్ ప్లే లిస్ట్‌’, ‘టాక్సీ డ్రైవర్’ వంటి హిట్ షోలు చేసి మంచి గుర్తింపు సాధించాడు. దీంతో వీటిని చూసిన ఈ షో దర్శకుడు ఈ సిరీస్‌లో పాత్రకి ఆయన్ని ఎంపిక చేసినట్లు తెలిపాడు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.