పుష్పరాజ్ క్రేజ్‌కు ఫిదా అయిన అమూల్ టీమ్..

ABN , First Publish Date - 2022-01-19T18:45:54+05:30 IST

పుష్పరాజ్ క్రేజ్‌కు ప్రముఖ బ్రాండ్ అమూల్ టీమ్ ఫిదా అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా రూపొందిన లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప ది రైజ్ పార్ట్ 1'.

పుష్పరాజ్ క్రేజ్‌కు ఫిదా అయిన అమూల్ టీమ్..

పుష్పరాజ్ క్రేజ్‌కు ప్రముఖ బ్రాండ్ అమూల్ టీమ్ ఫిదా అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా రూపొందిన లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప ది రైజ్ పార్ట్ 1'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో గత ఏడాది డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై భారీ సక్సెస్‌ను అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం షెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ళ పరంగా జోరు మీదుంది.


పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ పర్ఫరమెన్స్ అభిమానులతో పాటు ప్రేక్షకులను ఇండస్ట్రీ వర్గాలను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు, 'పుష్ప' చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు సుకుమార్ మీద.. అలాగే, హీరో అల్లు అర్జున్ మీద టాలీవుడ్, బాలీవుడ్ సహా మిగతా సౌత్ భాషలలోని సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే 'పుష్ప' చిత్రానికి అమూల్ ట్రీమ్ క్రేజీగా ట్రీట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాలో బన్నీ చెప్పిన డైలాగ్ దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ చిత్రంలోని పాటలకు ప్రముఖ స్టార్స్, సెలబ్రిటీలు తమదైన శైలిలో స్టెప్స్ వేస్తూ వైరల్ చేస్తున్నారు. 


ఇదే క్రమంలో పుష్ప రాజ్ క్రేజ్‌కు ప్రముఖ డైరీ బ్రాండ్ అమూల్ ఫిదా అయింది. 'పుష్పక్ ద స్లైస్' పేరుతో ఓ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి చిత్రబృందాన్ని అభినందించింది. అంతేకాదు, బన్నీ - రష్మిక పాత్రలను పోలివుండేలా కార్టూన్స్‌ను డిజ్సైన్ చేసి సర్‌ప్రైజ్ చేసింది. 'అమూల్ టాపికల్ సరికొత్త యాక్షన్ డ్రామా మూవీ భారీ హిట్' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్ట్‌కు 'అముల్లు.. అర్జున్' అంటూ క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తిరం. కాగా, ఈ పోస్ట్‌కు అల్లు అర్జున్ రిస్లై ఇవ్వడం విశేషం. "అల్లు టు మల్లు టు అములు అర్జున్" అంటూ లవ్ ఎమోజీని షేర్ చేశారు. మొత్తానికి పుష్ప రాజ్ అన్నీ చోట్ల హైలెట్ అయి హాట్ టాపిక్ అయ్యాడు. 

Updated Date - 2022-01-19T18:45:54+05:30 IST