ఒకేసారి రెండు షూటింగ్స్‌లో పాల్గొన్న అమితాబ్ ఎనభై వసంతాలకు దగ్గరలో ఉన్నా ఇప్పటికీ ఎంతో ఉత్సాహంతో పని చేసే నటుడు అమితాబ్. ప్రారంభంలో పనికిరాడని కొంతమంది తేల్చేసినా పట్టుదలతో కృషి చేసి టాప్ రేంజ్‌కు చేరుకున్నారు. 1970ల దశకంలో అమితాబ్ యాంగ్రీ యంగ్మన్ ఇమేజ్‌తో ఓ వెలుగు వెలిగారు. ఆ సమయంలోనే ఆయన నటించిన రెండు చిత్రాలు ‘దీవార్’, ‘షోలే’ విడుదలై , సంచలన విజయం సాధించాయి.
ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ‘దీవార్’ చిత్రంలోని పతాక సన్నివేశాల్ని రాత్రి పూట చిత్రీకరించారు. బల్లార్డ్ ఎస్టేట్‌లో వీటిని చిత్రీకరించారు. అక్కడ నైట్ మాత్రమే షూటింగ్ చేయడానికి అనుమతి లభించడంతో రాత్రి పది గంటలనుంచి తెల్లారి ఐదు వరకూ షూటింగ్ చేసేవాళ్లం. అదే సమయంలో బెంగళూరు సమీపంలోని ఓ విలేజ్‌లో ‘షోలే’ షూటింగ్ జరుగుతుండేది. అక్కడ కూడా నేను చేయాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. దేన్నీ వాయిదా వేయడానికి వీల్లేని పరిస్థితి. అందుకే తెల్లారి ఐదు గంటల వరకూ ‘దీవార్’ షూటింగ్లో పాల్గొని అటునుంచి అటే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి, ఫ్లైట్ ఎక్కి బెంగళూరు చేరేవాణ్ణి. అక్కడ ఎయిర్ పోర్ట్‌లో నా కోసం ఓ కారు సిద్ధంగా ఉండేది. ఎయిర్పోర్ట్ నుంచి ‘షోలే’ లొకేషన్‌కు గంట ప్రయాణం. సాయంత్రం వరకూ షూటింగ్ చేసి, మళ్లీ ఫ్లైట్‌లో ముంబై చేరేవాణ్ణి. విమానంలోనే నిద్ర పోయేవాణ్ణి. ఒకటి కాదు రెండు కాదు .. చాలా రాత్రుళ్లు ఇలా ముంబై బెంగళూరు మధ్య ప్రయాణాలు చేసేవాణ్ణి’ అని చెప్పారు అమితాబ్.
అలాగే వాళ్ల నాన్న హరివంశ్రాయ్ బచ్చన్ చనిపోయినప్పుడు కూడా అమితాబ్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. వాళ్ల నాన్నగారు చనిపోయినప్పుడు విదేశాల్లో ఉన్నారు అమితాబ్, పన్నెండు ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లారు. ఆ టూర్ మధ్యలో ఉండగా ఈ విషాద వార్త తెలిసింది. ఆదివారం ప్రదర్శన ఇచ్చి, విమానం ఎక్కారు అమితాబ్. శుక్రవారం రాత్రి వరకూ తండ్రికి శాస్త్రోస్తకంగా చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసి తిరిగి అదే రోజు ఫ్లైట్ ఎక్కారు . ‘ఎక్కడా ఫ్లైట్ మిస్ కాలేదు. అలాగే ఒక్క ప్రోగ్రామ్ కూడా నేను లేకుండా జరగలేదు’ అంటూ తన బ్లాగులో రాసుకొచ్చారు అమితాబ్.