Abhishek Bachchan: అమితాబ్‌ బచ్చన్‌పై జోక్స్.. టాక్ షో సెట్ నుంచి హీరో వాకౌట్..

ABN , First Publish Date - 2022-10-06T22:43:48+05:30 IST

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan). ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కూలెస్ట్, కామెస్ట్ యాక్టర్‌గా అతడికి పేరుంది

Abhishek Bachchan: అమితాబ్‌ బచ్చన్‌పై జోక్స్.. టాక్ షో సెట్ నుంచి హీరో వాకౌట్..

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan). ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కూలెస్ట్, కామెస్ట్ యాక్టర్‌గా అతడికి పేరుంది. తాజాగా తన తండ్రి అమితాబ్‌పై జోక్ వేయడంతో షో సెట్ నుంచి అభిషేక్ వాకౌట్ చేశాడు. తాను ఫూల్‌ని కాదని చెప్పుకొచ్చాడు. షో షూటింగ్‌ని ఆపేయాలని మేకర్స్‌ను కోరాడు. ఈ ఘటనతో షోకు హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న రితేశ్ దేశ్‌ముఖ్, కుష కపిల షాక్ అయ్యారు.   


‘కేస్ తో బన్ తా హై’ (Case Toh Banta Hai) షోకు రితేశ్ దేశ్‌ముఖ్ (Riteish Deshmukh), కుష కపిల (Kusha Kapila) హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ టాక్‌షో అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతుంటుంది. తాజాగా షోకు గెస్ట్‌గా అభిషేక్ బచ్చన్ వచ్చాడు. అందులో భాగంగా పరితోష్ త్రిపాఠి బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీపై జోక్ వేశాడు. దీంతో జూనియర్ బచ్చన్ కోపానికి లోనయ్యాడు. ‘‘నేను షోలో పాల్గొనడానికి వచ్చాను. తల్లిదండ్రులను ఇందులోకి లాగకండి. మీరు హద్దులను దాటుతున్నారు. నాపై జోక్స్ వేయండి. మా తండ్రిపై జోక్ వేస్తే నాకు బాగా అనిపించదు’’ అని అభిషేక్ బచ్చన్ తెలిపాడు. జూనియర్ బచ్చన్‌కు సర్ది చెప్పడానికి పరితోష్ ప్రయత్నించాడు. పరిస్థితులను చక్కదిద్దేందుకు ‘కేస్ తో బన్ హై’ మేకర్స్ ప్రయత్నించారు. అయినప్పటికి, అభిషేక్ షూటింగ్‌ను మధ్యలోనే వదిలివేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో అక్కడున్న వారందరు షాక్‌కు లోనయ్యారు. ‘కేస్ తో బన్ తా హై’ కు గతంలో పలువురు సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. విక్కీ కౌశల్, సారా అలీఖాన్, సంజయ్ దత్, అనిల్ కపూర్ వంటి సెలబ్రిటీలు ఈ టాక్ షోలో సందడి చేశారు.  


Updated Date - 2022-10-06T22:43:48+05:30 IST