Amitabh Bachchan: వర్క్ కోసం బాలీవుడ్ బడా నిర్మాత వద్దకు బిగ్‌బీ వెళ్లినప్పుడు..

ABN , First Publish Date - 2021-09-27T23:20:44+05:30 IST

భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు యశ్‌‌రాజ్ ఫిల్మ్స్. ఆ సంస్థ అధినేతే యశ్‌చోప్రా. బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ ఒకానొక సమయంలో ఆర్థికంగా కుంగిపోయాడు. దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాడు. ఆ సమయంలో బాలీవుడ్ బడా నిర్మాత యశ్‌చోప్రా దగ్గరికి వెళ్లి సహాయం చేయమని కోరాడు.

Amitabh Bachchan: వర్క్ కోసం బాలీవుడ్ బడా నిర్మాత వద్దకు బిగ్‌బీ వెళ్లినప్పుడు..

ముంబై: భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు యశ్‌‌రాజ్ ఫిల్మ్స్. ఆ సంస్థ అధినేతే యశ్‌చోప్రా. బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ ఒకానొక సమయంలో ఆర్థికంగా కుంగిపోయాడు. దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాడు. ఆ సమయంలో బాలీవుడ్ బడా నిర్మాత యశ్‌చోప్రా దగ్గరికి వెళ్లి సహాయం చేయమని కోరాడు. అందుకు ఆయన స్పందించిన విధానం గురించి ఇటీవల ఒక షోలో వివరించాడు.


బిగ్‌బీ సొంత నిర్మాణ సంస్థ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏబీసీఏల్). తన సొంత బ్యానర్‌పై 1990వ దశకంలో అనేక సినిమాలు తీసి ఆయన చేతులు కాల్చుకున్నాడు. దివాలా అంచుకు చేరుకున్నాడు. ఆనాడు జరిగిన ఈ విషయాల గురించి ఓ షోలో అమితాబ్ గుర్తుకు తెచ్చుకున్నారు... యశ్‌చోప్రా దగ్గరకు వెళ్లి పని ఇవ్వమని అడిగాడు. ఆ సమయంలో యశ్‌చోప్రా తను నిర్మించే ఒక చిత్రంలో ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పేరే మొహబ్బతే. ఈ సినిమాకు యశ్ కుమారుడు ఆదిత్యచోప్రా దర్శకత్వం వహించాడు. అనంతరం కొద్దికాలంలోనే బిగ్‌బీకి ‘‘ కౌన్ బనేగా కరోడ్ పతి(కేబీసీ) ’’ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది. ఈ షో బుల్లితెర మీద భారీ విజయం సాధించడంతో ఆయన ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ నాగ్ ఆశ్విన్ తెరకెక్కిస్తోన్న ప్రభాస్ చిత్రంలో నటించనున్నాడు. ఆయన నటిస్తోన్న మేడే, గుడ్ బై, బ్రహాస్త్ర వంటి అనేక చిత్రాలు ఇంకా సెట్స్ మీద ఉన్నాయి.

Updated Date - 2021-09-27T23:20:44+05:30 IST