బిగ్ బీ ఇంట్లో అద్దెకు దిగిన కృతి సనన్

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో కృతి సనన్ అద్దెకు దిగింది. అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్ వాలా రహదారిలో ఉన్న అట్లాంటిస్ బిల్డింగ్‌లో అమితాబ్ బచ్చన్‌కు ఒక డూప్లెక్స్ ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్‌లోనే కృతి సనన్ అద్దెకు ఉండబోతుంది. ఈ ప్లాట్‌కు అద్దెగా ఆమె రూ. 10లక్షలు చెల్లించనుంది. సెక్యూరిటీ డిపాజిట్‌గా ఆమె ఇప్పటికే రూ.60లక్షలు చెల్లించిందని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమితాబ్, కృతి సనన్ మధ్య ఒప్పందం కూడా కుదిరిందని సమాచారం. ఆ ఒప్పందం ప్రకారం 2021 అక్టోబర్ 16 నుంచి 2023 అక్టోబర్ 15 వరకు ఈ డూప్లెక్స్ ఫ్లాట్ ఆమె ఆధీనంలో ఉంటుంది. 


ఆయన అట్లాంటిస్‌లోని ఈ డూప్లెక్స్ ఫ్లాట్‌ను రూ.31కోట్లు వెచ్చించి ఒక బిల్డర్ నుంచి కొనుగోలు చేశారు. ముంబైలోని జుహులో వత్స, అమ్ము అనే రెండు భవంతులు కూడా బిగ్‌బీకి ఉన్నాయి. ఆ భవంతులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15ఏళ్ల కాలానికి అద్దెకిచ్చారు. ఆయనకు అద్దె రూపంలో నెలకు రూ.18.9లక్షలు వస్తున్నట్టు తెలుస్తోంది. అట్లాంటిస్‌లోనే సన్నీ లియోన్‌కు ఒక అపార్ట్‌మెంట్ ఉంది. ఆమె దాదాపుగా రూ. 16కోట్లు వెచ్చించి 2021 మార్చి 28న ఆ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ఆమె వన్ నేనొక్కడినే, బరైలీ‌ కీ బర్ఫీ, లుకా ఛప్పీ వంటి సినిమాల్లో నటించింది.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.