Amitabh Bachchan: విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు

ABN , First Publish Date - 2022-09-22T21:00:11+05:30 IST

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. సినిమా తారలు ఈ సామెతను తూచ తప్పకుండా పాటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కొన్ని రోజుల క్రితమే

Amitabh Bachchan: విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. సినిమా తారలు ఈ సామెతను తూచ తప్పకుండా పాటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కొన్ని రోజుల క్రితమే డూప్లెక్స్ ప్లాట్‌ను కొన్నారు. తాజాగా మరో ఖరీదైన ఫ్లాట్‌ను ముంబైలో కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్ విస్తీర్ణం నాలుగు భవంతులంత ఉంటుందని తెలుస్తోంది. దాదాపుగా 12వేల చదరపు అడుగులు అని సమాచారం. ప్రస్తుతం నివసిస్తున్న భవనంలోనే అమితాబ్ ఉంటారని సమాచారం. కొత్త ఫ్లాట్‌ను ఇన్వెస్ట్‌మెంట్ కోణంలోనే కొనుగోలు చేశారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఫ్లాట్ ఖరీదు తెలియడం లేదు.       


బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ గతంలోనే ఓ ప్లాట్‌ను కొన్నారని వార్తలు వెలువడ్డాయి. ముంబైలో క్రిస్టల్ గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ అట్లాంటిస్ పేరుతో ఓ ప్రాజెక్టును రూపొందిస్తుంది. ఈ ప్రాజెక్టులో అమితాబ్ బచ్చన్ 2020, డిసెంబరులో ఓ ప్లాట్‌ను కొనుగోలు చేశారు. ఈ ప్లాట్ విస్తీర్ణం 5,184చదరపు అడుగులు ఉంటుందని సమాచారం. 2021 ఏప్రిల్‌లో ఈ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ప్లాట్ ఖరీదు రూ.31కోట్లు అని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీగా రూ.62లక్షలను కూడా చెల్లించారు. ప్లాట్ కొనుగోలు చేసినందుకు బిగ్ బీకి ఆరు పార్కింగ్ స్థలాలు లభించాయి. బిగ్ బీ ఈ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కృతి సనన్‌కు అద్దెకిచ్చారు. నెలకు రూ. 10లక్షలు అద్దె రూపంలో తీసుకుంటున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ కింద కృతి రూ. 60లక్షలు చెల్లించింది. ఇక అమితాబ్ కెరీర్ విషయానికి వస్తే.. చివరగా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) లో నటించారు. ఆలియా భట్, రణ్ బీర్ కపూర్, నాగార్జున, మౌనిరాయ్ కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్-కె’ లోను కీలక పాత్ర పోషిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీలో అమితాబ్ రోల్‌ను మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను ఆధారంగా చేసుకుని రూపొందించారని వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి.  


Updated Date - 2022-09-22T21:00:11+05:30 IST