అభిషేక్, ఆరాధ్య ఇచ్చిన గిఫ్ట్స్ రివీల్ చేసిన బిగ్ బీ

ABN , First Publish Date - 2021-09-22T19:19:51+05:30 IST

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ .. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడు ఇన్ స్టా గ్రామ్ పేజ్ ఓపెన్ చేసినా.. అందులో ఆయనకు సంబంధించిన స్వీట్ మెమరీసే కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు వాటి గురించి నెటిజెన్స్ తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు.

అభిషేక్, ఆరాధ్య ఇచ్చిన గిఫ్ట్స్ రివీల్ చేసిన బిగ్ బీ

బాలీవుడ్  బిగ్ బీ అమితాబ్ .. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడు ఇన్ స్టా గ్రామ్ పేజ్ ఓపెన్ చేసినా.. అందులో ఆయనకు సంబంధించిన స్వీట్ మెమరీసే కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు వాటి గురించి నెటిజెన్స్ తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు.  ఆయన  వాటి గురించి ఏమీ దాచుకోకుండా వివరిస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న  ఓ గేమ్ షో లో ఓ కంటెస్టెంట్ అమితాబ్ ధరించిన రెయిన్ బో జాకెట్ ను ప్రశంసిస్తూ.. దాని గురించి ఆరాతీశాడు. అది తన బర్త్ డే సందర్భంగా కొడుకు అభిషేక్ తనకి ప్రజెంట్ చేసిన గిఫ్ట్ అని చెప్పారు. 


అలాగే..  ఆ కంటెస్టెంట్ ఇన్ స్టా గ్రామ్ లో ఉన్న ఓ ఫోటో ను పాయింట్ చేస్తూ .. అందులో ఆయన పెట్టుకొన్న గ్లాసెస్ గురించి అడిగాడు. అది తనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మనవరాలు ఆరాధ్య ప్రెజెంట్ చేసిందని చెప్పి.. ఆ కంటెస్టెంట్ ను ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉంటే..  ఇటీవల బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్  ఆ షోకి అతిథిగా వచ్చి,  ఆయన ఆటోగ్రాఫ్ చేసిన టై బౌను బహుమతిగా అందుకున్నారు. దాని గురించి జాకీ  తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వివరిస్తూ.. అమితాబ్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-09-22T19:19:51+05:30 IST