విడిపోయినా కలిసే ఉంటాం: ఆమిర్‌ఖాన్‌

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు దంపతులు 15 ఏళ్ల బంధానికి విడాకులతో స్వస్తి చెప్పారు. కొత్త జీవితం కోసం విడాకులు తీసుకుంటున్న విషయాన్ని శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే! విడిపోయినప్పటికీ కుటుంబ పరంగా కలిసే ఉంటామని ప్రకటించారు. ఈ విషయంపై నెటిజన్లు ట్రోల్‌ చేయడంలో ఆదివారం ఆమిర్‌, కిరణ్‌ రావు సంయుక్తంగా ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఆమిర్‌ మాట్లాడుతూ ‘‘ భార్యాభర్తలుగా విడిపోయినా మేము ఒకరి ఒకరం తోడుగా ఉంటాం. మాది ఒకటే కుటుంబం. ‘మా విడాకులు వార్త విని అభిమానులంతా షాక్‌ అయ్యుండొచ్చు. పలువుర్ని బాధ కలిగించి ఉండొచ్చు. కానీ మా నిర్ణయంతో మేమీద్దరం చాలా సంతోషంగా ఉన్నామని మీకు చెప్పాలనుకుంటున్నాం. మా సంబంధంలో మార్పు వచ్చింది కానీ ఎప్పటికీ ఒకరికి ఒకరం తోడుగా ఉంటాం’’ అని ఆమిర్‌ పేర్కొన్నారు. ‘మా కుమారుడు ఆజాద్‌ బాధ్యతను, పానీ ఫౌండేషన్‌ బాధ్యతలను ఇద్దరం కలిసి చూసి తీసుకుంటామని కిరణ్‌రావు తెలిపారు. 



Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.