అమెరికాలో అదరగొట్టేస్తారు

రాజమౌళి సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’పై కూడా ఆ భారం భారీగానే ఉంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. జనవరి 7న వస్తోంది. సంక్రాంతి సీజన్‌కు ఘనమైన ఆరంభాన్ని ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఇవ్వబోతోందని చిత్రసీమ గట్టిగా నమ్ముతోంది. ఈనెల 9న ట్రైలర్‌ రాబోతోంది. ఈ ట్రైలర్‌ని రెండు తెలుగు రాష్ర్టాలలో ఉన్న ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతోంది చిత్రబృందం. విడుదల కూడా కనీ వినీ ఎరుగని రీతిలో ప్లాన్‌ చేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే వెయ్యికి పైగా మల్టీప్లెక్సులు బ్లాక్‌ చేశారని తెలుస్తోంది. అమెరికాలో ఓ భారతీయ సినిమా ఈస్థాయిలో ఎప్పుడూ విడుదల కాలేదని, ఆరకంగా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రికార్డు సృష్టించబోతోందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.