‘‘అతను వెనక నుంచి వచ్చి నా యదపై చేయి వేశాడు...’’
ABN , First Publish Date - 2021-10-04T01:32:14+05:30 IST
ఎమిలీ రటాజ్కోవ్స్కీ ఓ అమెరికన్ మోడల్. ఆమె ఒక బుక్ రాసింది. త్వరలో విడుదల కాబోతోంది. ఆమె గ్రంథం పేరు.. ‘మై బాడీ‘! ఇంతకీ, అందులో ఏముంటుంది?

ఎమిలీ రటాజ్కోవ్స్కీ ఓ అమెరికన్ మోడల్. ఆమె ఒక బుక్ రాసింది. త్వరలో విడుదల కాబోతోంది. ఆమె గ్రంథం పేరు.. ‘మై బాడీ‘! ఇంతకీ, అందులో ఏముంటుంది? చాలా మంది ఎమిలీ అభిమానులకి ప్రస్తుతం అదే ప్రశ్న. కానీ, పుస్తకంలో ఏముందో ఇంకా పూర్తి క్లారిటీ లేదుగానీ... ఓ షాకింగ్ ఆరోపణ అయితే హాట్ మోడల్ అప్పుడే చేసేసింది. ఆమె మాటలతో ఇప్పుడు అమెరికన్ సింగర్ రాబిన్ తికే పేరు జనాల నోళ్లలో నానుతోంది.
ఎమిలి, రాబిన్ అప్పట్లో ‘బ్లర్డ్ లైన్స్’ అనే మ్యూజిక్ వీడియో చేశారు. ఆ షూటింగ్ సమయంలో ఆయన తాగి సెట్స్ మీదకు వచ్చాడట. అంతే కాదు,
నగ్నంగా ఉన్న తన స్థనాల్ని కూడా రాబిన్ టచ్ చేశాడంటూ తీవ్రమైన ఆరోపణ చేసింది ఎమిలీ. ‘‘ఓ కొత్త వ్యక్తి స్పర్శ తాలూకూ చల్లదనం నా వక్షోజాలపై... నేను వెంటనే పసిగట్టాను. అమాంతం పక్కకు జరిగిపోయాను. వెనక్కి చూస్తే రాబిన్ కనిపించాడు’’ అంటూ ఆమె ఆనాడు జరిగింది వివరించింది. ఎమిలీ తన గురించి చేసిన ఆరోపణపై అమెరికన్ సింగర్ రాబిన్ ఇంకా స్పందించలేదు. అయితే, ఆమె ‘మై బాడీ’ పుస్తకంలో ఇంకా అనేక ఎక్స్‌ప్లోజివ్ రివీలీషన్స్ ఉండవచ్చని చాలా మంది భావిస్తున్నారు...