Nicole Richie : బర్త్ డే సెలబ్రేషన్స్ లో జుట్టుకు నిప్పు

ABN , First Publish Date - 2021-09-23T15:37:23+05:30 IST

అమెరికన్ నటీమణి, ఫ్యాషన్ డిజైనర్ అయిన నికోల్ రిచీ బర్త్ డే సెలబ్రేషన్స్ చావుతప్పి కన్నులొట్టపోయినట్టైంది. ఆమె 40వ జన్మదినాన్ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసింది.

Nicole Richie : బర్త్ డే సెలబ్రేషన్స్ లో జుట్టుకు నిప్పు

అమెరికన్ నటీమణి, ఫ్యాషన్ డిజైనర్ అయిన నికోల్ రిచీ బర్త్ డే సెలబ్రేషన్స్ చావుతప్పి కన్నులొట్టపోయినట్టైంది. ఆమె 40వ జన్మదినాన్ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ఒక కేక్ పై గుచ్చిన కేండిల్స్ ను ఆర్పుతుండగా.. ప్రమాదవశాత్తు ఆమె టాప్ కు నిప్పంటుకుని .. మంటలు ఆమె జుట్టుకు కూడా పాకాయి. దాంతో అలెర్ట్ అయిన ఆమె ఫ్రెండ్స్ వాటిని ఆర్పారు. ఈ ప్రమాదం గురించి నికోల్ తన ఇన్ స్టా గ్రామ్ పేజ్ లో తెలిపింది. ఒక ఫైర్ ఎమోజీ పెట్టి.. ‘నా 40వ జన్మదినం బాగానే జరిగింది’ అని పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు తన ఫ్రెండ్స్ నుంచి భారీ ఎత్తున కామెంట్స్ వచ్చాయి. అందులో సింగర్ క్యాటీ పెరీ బాగా రియాక్ట్ అవుతూ.. wait noway wait omg అని కామెంట్ పెట్టింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



Updated Date - 2021-09-23T15:37:23+05:30 IST