అలాంటి వారికి అన్నపూర్ణ స్టూడియో గేట్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి: అమల అక్కినేని

ABN , First Publish Date - 2022-01-18T03:26:06+05:30 IST

ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 1’. ఈ సిరీస్ ప్రేక్షకాదరణ పొందడంతో.. దీనికి సీక్వెల్‌గా ‘లూజర్ 2’ను మేకర్స్ సిద్ధం చేశారు. తొలి సీజన్

అలాంటి వారికి అన్నపూర్ణ స్టూడియో గేట్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి: అమల అక్కినేని

ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 1’. ఈ సిరీస్ ప్రేక్షకాదరణ పొందడంతో.. దీనికి సీక్వెల్‌గా ‘లూజర్ 2’ను మేకర్స్ సిద్ధం చేశారు. తొలి సీజన్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించగా.. సీక్వెల్‌కు అభిలాష్ రెడ్డితో పాటు శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. దీనికి అభిలాష్ రెడ్డి క్రియేటర్. జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ నిర్మించాయి. ఈ సీక్వెల్ జనవరి 21న విడుదల కాబోతోన్న సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. 


ఈ కార్యక్రమానికి హాజరైన అక్కినేని అమల మాట్లాడుతూ.. ‘‘అన్నపూర్ణ ఫిలిం మీడియా కాలేజ్‌లో ట్రైన్ అయినవారు ఇండియా మొత్తం సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు యూత్ అంతా న్యూ ఐడియాస్, న్యూ థీమ్స్, న్యూ స్టోరీస్‌తో ముందుకు వస్తున్నారు. మంచి కథలతో వచ్చే వారికి అన్నపూర్ణ స్టూడియో గేట్స్ ఎప్పుడు ఓపెన్‌గా ఉంటాయి. అలాగే వారికి మేము అండగా ఉంటాము. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ‘లూజర్’ సీజన్ 1 చాలా బాగుంది. సీజన్ 2 గా వస్తున్న ‘లూజర్ 2’ కూడా అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ.. టీం అందరికీ ఆల్ ద బెస్ట్’’ అన్నారు.


నిర్మాత సుప్రియ మాట్లాడుతూ.. ‘‘జీ 5 అసోసియేట్‌లో ‘లూజర్’ వెబ్ సిరీస్ చేసి మళ్లీ ఇప్పుడు ‘లూజర్ 2’ చేయడం చాలా సంతోషంగా ఉంది. జీ 5 నిమ్మకాయల ప్రసాద్ గారికి మొదట ఈ స్టోరీ చెప్పగానే మమ్మల్ని నమ్మి ఈ సిరీస్‌ను చేయడానికి ముందుకు వచ్చారు. వారికి మా ధన్యవాదాలు. అలాగే మా ప్రొడక్షన్ టీం అంతా చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా స్పెక్ట్రమ్ మీడియాతో పాటు మా టీం లో చంద్ర, మహేష్ ఫుల్ సపోర్ట్ చేశారు.. వారందరికీ మా ధన్యవాదాలు’’ అని తెలిపారు.

Updated Date - 2022-01-18T03:26:06+05:30 IST