మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri seetharama raju)125వ జయంతి వేడుకలకు హాజరు కావాలంటూ మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వనం అందింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైభవంగా నిర్వహించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జులై 4న భీమవరంలోని పెద అమీరం ప్రాంతంలో స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చిరంజీవికి(Chiranjeevi) లేఖ పంపారు. ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరారు. ఏడాదిపాటు వివిధ సంస్కాృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు జరగనున్నాయని పేర్కొన్నారు. (Chiranjeevi guest for alluri statue unveiling)