అల్లు శిరీష్‌కు తన మెడకు బ్యాండ్ వేసిన ఫొటో ఒకటి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. దాన్ని చూసి ఫ్యాషన్ ఎక్సేసరీ అనుకున్నారంతా! అయితే అది ఫ్యాషన్ కోసం కాదని ఆయన తెలిపారు. స్ట్రెంగ్త్ వర్కవుట్స్ చేస్తున్న క్రమంలో మెడకు గాయమైందని, అందుకే ఈ బ్యాండేజ్ వాడుతున్నా అని ఆయన ఓ ఫొటో షేర్ చేసి సమాధానమిచ్చారు. ఈ మధ్యన శిరీష్ వ్యాయామాల మీద దృష్టి పెట్టి కండలు పెంచిన సంగతి తెలిసిందే! ‘ఎబిసిడి’ సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ఆయన రాకేష్ శశి దర్శకత్వంలో ‘ప్రేమ కాదంట’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అను ఇమ్మాన్యూయేల్ కథానాయిక.