బాలీవుడ్‌లో భారీ ఎత్తున విడుదల కానున్న ‘‘అలవైకుంఠపురంలో’’ సినిమా.. ఆ రోజున ట్రైలర్ రిలీజ్..
ABN , First Publish Date - 2022-01-19T21:03:28+05:30 IST
టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమా ‘‘అల వైకుంఠపురంలో’’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించారు. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమా ‘‘అల వైకుంఠపురంలో’’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించారు. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఆ చిత్రం నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘‘పుష్ప’’ సినిమా బాలీవుడ్‌లో ఈ మధ్యనే విడుదలై ఘనవిజయం సాధించింది. హిందీ సినిమాలకు ధీటుగా అక్కడ వసూళ్లను రాబట్టింది. దీంతో నిర్మాతలు బన్నీ క్రేజ్‌ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ‘‘అల వైకుంఠపురంలో’’ సినిమాని డబ్ చేసి జనవరి 26న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా డబ్బింగ్ హక్కులు ‘‘గోల్డ్ మైన్స్ టెలీఫిలింస్’’ అధినేత మనీశ్ షా వద్ద ఉన్నాయి. ఆయనే ‘‘పుష్ప’’ ని హిందీలో విడుదల చేశారు.
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో పలు రాష్ట్రాలు థియేటర్లపై ఆంక్షలు విధించాయి. దీంతో జనవరిలో విడుదల కావాల్సిన సినిమాలన్ని వాయిదా పడ్డాయి. సినిమా హాళ్లపై ఆంక్షలు ఉన్నప్పటికి ‘‘పుష్ప’’ బాలీవుడ్‌లో భారీ విజయం సాధించింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దీంతో బన్నీ బిగ్గెస్ట్ హిట్ అయిన ‘‘అల వైకుంఠపురంలో’’ చిత్రాన్ని ‘‘గోల్డ్ మైన్స్ టెలీ ఫిలింస్’’ అధినేత మనీశ్ షా హిందీలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంపై ఎగ్జిబిటర్లు కూడా భారీ ఆశలను పెట్టుకున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 20న రిలీజ్ చేస్తామని మనీశ్ షా మీడియాతో తెలిపారు. భారత్‌లో 2000 స్క్రీన్స్‌ల్లో చిత్రాన్ని విడుదల చేయలాని ఆలోచిస్తున్నామన్నారు. సింగిల్ స్ర్కీన్ ప్రేక్షకులే తమ లక్ష్యమని వెల్లడించారు.