Icon Star తో కమల్ డైరెక్టర్..?

ABN , First Publish Date - 2022-06-16T15:30:45+05:30 IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప: ది రైజ్' (Pushpa The Rise) సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్నారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో

Icon Star తో కమల్ డైరెక్టర్..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప: ది రైజ్' (Pushpa The Rise) సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్నారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప పార్ట్ 1' సినిమా గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. ఇప్పుడు 'పుష్ప 2' (Pushpa 2) కోసం సుక్కూ బాగా కసరత్తు చేస్తున్నారు. అయితే, ఈ సీక్వెల్ మూవీ తర్వాత బన్నీ ఎవరితో సినిమాను కమిటవుతారు..ఎలాంటి కథను ఎంచుకుంటారనే విషయంలో అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే బన్నీ కమిటైన 'ఐకాన్' (Icon) మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ లేవు.


ఇక మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తారని వార్తలు వచ్చాయి. అలాగే, తమిళ స్టార్ డైరెక్టర్స్ మురగదాస్, లింగుస్వామి బన్నీకి కథ చెప్పి ఒప్పించారని ప్రచారం జరిగింది. కానీ, వీటికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇప్పటివరకు రానేలేదు. ఇక కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ప్రకటించిన కొత్త చిత్రాన్ని కూడా బన్నీ ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారు. ఇలా, ప్రచారంలో అయితే చాలామంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి గానీ, అఫీషియల్‌గా మాత్రం ఒక్క ప్రాజెక్ట్ అనౌన్స్ కావడం లేదు.


అయితే, ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ (Lokesh Kanagaraj)తో చేయనున్నారట. 'మా నగరం' వంటి విభిన్నమైన కథా చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన లోకేష్.. ఆ తర్వాత తీసిన 'ఖైదీ', 'మాస్టర్', ఇటీవల కమల్‌తో రూపొందించిన 'విక్రమ్' చిత్రంతో వరుసగా హిట్స్ అందుకొని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయారు. ఇప్పుడు అటు కోలీవుడ్‌లోనే కాక మన టాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోలు లోకేష్‌తో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీ తన నెక్స్ట్ సినిమాను లోకేష్ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. 

Updated Date - 2022-06-16T15:30:45+05:30 IST