దుబాయ్ లో అల్లు అర్జున్ .. వైరల్ అవుతోన్న ఫోటో

ABN , First Publish Date - 2021-09-26T17:26:37+05:30 IST

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల కానున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయికగా అలరిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.

దుబాయ్ లో అల్లు అర్జున్ .. వైరల్ అవుతోన్న ఫోటో

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..  సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్  ఈ మూవీని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.  పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల కానున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయికగా అలరిస్తుండగా..  మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ దొరకడంతో బన్నీ ప్రస్తుతం దుబాయ్ లో కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తున్నారు. 



దుబాయ్ లోని ఆకాశ హర్మ్యాల బ్యాక్ గ్రౌండ్ లో రివీలైన అల్లు అర్జున్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నలుపురంగు దుస్తుల్లో ‘పుష్ప’లోని గెడ్డం లుక్ లో కనిపిస్తున్న బన్నీ.. ఆకట్టుకుంటున్నాడు. క్రిస్మస్ కానుకగా ‘పుష్ప’ మూవీని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఆల్రెడీ ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ తెచ్చుకున్నాయి. ‘అల వైకుంఠపురములో’ మూవీ తర్వాత బన్నీ నటించిన సినిమా ఇదే కావడంతో  పుష్ప మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Updated Date - 2021-09-26T17:26:37+05:30 IST