బాలీవుడ్‌లో మళ్ళీ సందడి చేయబోతున్న బన్నీ

ABN , First Publish Date - 2022-01-17T18:44:40+05:30 IST

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప ది రైజ్’ విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండియన్ స్ర్కీన్ అయింది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమా ఏకంగా రూ. 80కోట్లకు పైగానే వసూళ్ళు రాబట్టి.. ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఈ సినిమా హిందీ వెర్షన్ పై మేకర్స్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. అనూహ్యమైన వసూళ్ళతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడింది. బన్నీ మేకోవర్, పుష్ప కేరక్టర్ ట్రాన్స్ ఫార్మేషన్‌కు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పుష్ఫ హిందీ వెర్షన్ ఇంకా థియేటర్స్‌‌లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపడుతోంది.

బాలీవుడ్‌లో మళ్ళీ సందడి చేయబోతున్న బన్నీ

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప ది రైజ్’ విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండియన్ స్ర్కీన్ అయింది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమా ఏకంగా రూ. 80కోట్లకు పైగానే వసూళ్ళు రాబట్టి.. ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఈ సినిమా హిందీ వెర్షన్ పై మేకర్స్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. అనూహ్యమైన వసూళ్ళతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడింది. బన్నీ మేకోవర్, పుష్ప కేరక్టర్ ట్రాన్స్ ఫార్మేషన్‌కు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పుష్ఫ హిందీ వెర్షన్ ఇంకా థియేటర్స్‌‌లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపడుతోంది. ఇదిలా ఉంటే..  ఇదే నెల్లో బాలీవుడ్ ప్రేక్షకుల కోసం బన్నీ మరో సర్ ప్రైజ్ రెడీ చేశాడు. 


రెండేళ్ళ క్రితం బన్నీ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా కూడా బన్నీకి అద్భుతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులోని పాటలు, బన్నీ డ్యాన్స్ అభిమానుల్ని ఏ స్థాయిలో అలరించాయో తెలిసిందే. ఈ నెల 26న ఈ సినిమా హిందీ వెర్షన్ ను విడుదల చేయబోతున్నారు. ‘పుష్ప’‌తో బన్నీ తెచ్చుకున్న సూపర్  క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొన్న మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రత్యేక పోస్టర్ ను షేర్ చేస్తూ  ట్వీట్ చేశారు. మరి ఈ సినిమాతో బన్నీ బాలీవుడ్ లో ఇంకేరేంజ్ లో మ్యాజిక్ చేస్తాడో చూడాలి. 



Updated Date - 2022-01-17T18:44:40+05:30 IST