తన స్నేహితులు, సన్నిహితులకు స్పెషల్గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేయడం అల్లు అర్జున్‌కు అలవాటు. తాజాగా అలాంటి స్వీట్ గిఫ్ట్‌తో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను సర్ప్రైజ్ చేశారు బన్నీ. ‘రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ డిఎ్‌సపి’ అని రాసి ఉన్న లైటింగ్ నేమ్ బోర్డ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించి పంపారు. అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఎంతో ఆనందంగా స్వీకరించిన దేవి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రాక్‌స్టార్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్. థాంక్యూ సో మచ్ మై డియరెస్ట్ బన్నీ బాయ్... లవ్లీ సర్ప్రైజ్... అస్సలు ఊహించలేదు. నువ్వు చాలా స్వీట్ పర్సన్’ అని వీడియోలో బన్నీకి థాంక్స్ తెలిపారు దేవి.