pushpa : సెకండ్ సింగిల్ చిత్రీకరించిన లొకేషన్ ఇదే!

ABN , First Publish Date - 2021-09-27T19:17:08+05:30 IST

కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న ‘పుష్ప : ది రైజ్’ లోని ‘దాక్కో దాక్కో మేక’ అనే ఊరమాస్ సాంగ్ ని ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన కొద్ది సెకన్లలోనే రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంది పాట. మొత్తం 5 భాషల్లోనూ ఈ సాంగ్ ను విడుదల చేసి అభిమానుల్ని ఖుషీ చేశారు.

pushpa : సెకండ్ సింగిల్ చిత్రీకరించిన లొకేషన్ ఇదే!

కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న ‘పుష్ప : ది రైజ్’ లోని ‘దాక్కో దాక్కో మేక’ అనే ఊరమాస్ సాంగ్ ని ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన కొద్ది సెకన్లలోనే రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంది పాట. మొత్తం 5 భాషల్లోనూ ఈ సాంగ్ ను విడుదల చేసి అభిమానుల్ని ఖుషీ చేశారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈరోజు ఒక ఫోటోను విడుదల చేశారు. ఇందులో రెండో పాటను ఈ లొకేషన్ లోనే కొద్ది రోజుల క్రితం షూట్ చేసినట్టు తెలిపారు. 


పచ్చని చెట్లు , పారే సెలయేరు మధ్య ..  ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించారట దర్శకుడు సుకుమార్. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ను అతికొద్దిరోజుల్లోనే విడుదల చేస్తున్నట్టు, ఆ అప్టేడ్ కూడా వస్తుందని  ప్రకటించారు. ఇంతకు ముందు  సుక్కు, దేవీ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల్లోని పాటలు బన్నీ కెరీర్ లోనే మెమరబుల్ గా నిలిచాయి. ఇప్పుడు ‘పుష్ప’ లోని సాంగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. మరి పుష్పలోని సెకండ్ సాంగ్ .. ఇంకెన్ని రికార్డుల్ని నెలకొల్పుతుందో చూడాలి. 





Updated Date - 2021-09-27T19:17:08+05:30 IST