Allu arjun: 'గామి' చిత్ర యూనిట్‌కి స్పెషల్ విషెస్..

ABN , First Publish Date - 2021-10-22T16:46:12+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా గామి చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించాడు. 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నుమా దాస్', 'హిట్', 'పాగల్'..

Allu arjun: 'గామి' చిత్ర యూనిట్‌కి స్పెషల్ విషెస్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా గామి చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించాడు. 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నుమా దాస్', 'హిట్', 'పాగల్'.. సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఆయన తాజాగా నటిస్తున్న మరో విభిన్నమైన సినిమా 'గామి'. విద్యాధర్‌ కాగిట ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, చాందిని చౌదరి, అభినయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెల్యులాయిడ్‌, కార్తీక్‌ శబరిష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలింది చిత్రబృందం. ఈ గ్లింప్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే టైటిల్ గ్లింప్స్ పై అల్లు అర్జున్ స్పందన తెలియజేసాడు. ఈ ఇంట్రెస్టింగ్ టీజర్ బాగుంది. చిత్ర యూనిట్ అందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఇలాంటి యంగ్ కొత్త ఫిల్మ్ మేకర్స్ రావడం చాలా ఆనందంగా ఉంది..అని బన్నీ ట్వీట్ చేశాడు.



Updated Date - 2021-10-22T16:46:12+05:30 IST