బన్నీది బంగారం లాంటి మనసు

ABN , First Publish Date - 2021-12-09T15:50:56+05:30 IST

కొంతమంది హీరోలు.. తమకు నచ్చినవారికి, తమ పనితనంతో ఆకట్టుకున్నవారికి ఖరీదైన బహుమతులిచ్చి పోత్సహిస్తూంటారు. ఇదివరకు సూర్య, కీర్తి సురేశ్ లాంటి వారు తమ సినిమాలు విజయం సాధించిన సందర్బంగా.. చిత్ర బృందానికి గోల్డ్ రింగ్స్ ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. అలాగే.. మెగాస్టార్ ‘ఆచార్య’ టీమ్ మెంబర్స్ కి సోనూసూద్ ఖరీదైన ఫోన్స్ ప్రెజెంట్ చేశారు.

బన్నీది బంగారం లాంటి మనసు

కొంతమంది హీరోలు.. తమకు నచ్చినవారికి, తమ పనితనంతో ఆకట్టుకున్నవారికి ఖరీదైన బహుమతులిచ్చి పోత్సహిస్తూంటారు. ఇదివరకు సూర్య, కీర్తి సురేశ్ లాంటి వారు తమ సినిమాలు విజయం సాధించిన సందర్బంగా.. చిత్ర బృందానికి గోల్డ్ రింగ్స్ ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. అలాగే మెగాస్టార్ ‘ఆచార్య’ టీమ్ మెంబర్స్ కి సోనూసూద్ ఖరీదైన ఫోన్స్ ప్రెజెంట్ చేశారు. తాజాగా ఈ లిస్ట్ లోకి ‘పుష్ప’రాజ్ బన్నీ కూడా చేరడం హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కోసం తన టీమ్ కనబరిచిన పనితనానికి ఫిదా అయిపోయి ఏకంగా 12 మందికి గోల్డ్ రింగ్స్ ను ప్రెజెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 


ఒకో రింగ్ ఇంచు మించు పదిగ్రాముల వరకూ ఉంటుంది. ఇలా పన్నెండు మందికి పది గ్రాముల చొప్పున రింగ్స్ ను బహుమతిగా ఇవ్వడంతో అందరూ షాకవుతున్నారు. ఈ నెల 17న పాన్ ఇండియా రేంజ్ లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ‘పుష్ప’ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. మరోసారి థియేటర్స్ మాస్ జాతరతో మోతెక్కబోతున్నాయి. ఇటీవలే సమంతపై స్పెషల్ సాంగ్ చిత్రీకరణ పూర్తయినట్టు సమాచారం అందింది. విడుదలకు ముందు ఈ సాంగ్ ను విడుదల చేసి సినిమాపై మరింత హైపు పెంచబోతున్నారు. 

Updated Date - 2021-12-09T15:50:56+05:30 IST