బాలీవుడ్‌పై కన్నేసిన అల్లు అర్జున్ ?

ABN , First Publish Date - 2022-01-06T17:40:27+05:30 IST

‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ లో అరడజనుకు పైగానే పాన్ ఇండియా స్టార్స్ తయారయ్యారు. వారందరికీ ప్రభాస్ మార్గదర్శిగా మారాడు. ప్రభాస్ తర్వాత యన్టీఆర్, రామ్ చరణ్‌లు కూడా పాన్ ఇండియా స్టార్స్ గా సత్తాచాటడానికి రెడీ అవుతున్నారు. లైన్ లో మహేశ్ బాబు కూడా ఉన్నాడు. ఈ లోపే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. అలాగే.. మీడియం రేంజ్ నానీ సైతం ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ సక్సెస్‌తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. విడుదల రోజున మిశ్రమ స్పందనతో, నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకొని కూడా.. కళ్ళు చెదిరే కలెక్షన్స్ సాధించిన ‘పుష్ప చిత్రం బాలీవుడ్ లో అనూహ్యంగా సూపర్ సక్సెస్ అవడం ఆశ్చర్యం అనిపించకమానదు. ఇంతకు ముందు అతడి చిత్రాల హిందీ వెర్షన్స్ యూట్యూబ్ లో రికార్డు వ్వూస్ తెచ్చుకున్నాయి.

బాలీవుడ్‌పై కన్నేసిన అల్లు అర్జున్ ?

‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ లో అరడజనుకు పైగానే పాన్ ఇండియా స్టార్స్ తయారయ్యారు. వారందరికీ ప్రభాస్ మార్గదర్శిగా మారాడు. ప్రభాస్ తర్వాత యన్టీఆర్, రామ్ చరణ్‌లు కూడా పాన్ ఇండియా స్టార్స్ గా సత్తాచాటడానికి రెడీ అవుతున్నారు. లైన్ లో మహేశ్ బాబు కూడా ఉన్నాడు. ఈ లోపే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. అలాగే.. మీడియం రేంజ్ నానీ సైతం ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ సక్సెస్‌తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. విడుదల రోజున మిశ్రమ స్పందనతో, నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకొని కూడా.. కళ్ళు చెదిరే కలెక్షన్స్ సాధించిన ‘పుష్ప చిత్రం బాలీవుడ్ లో అనూహ్యంగా సూపర్ సక్సెస్ అవడం ఆశ్చర్యం అనిపించకమానదు. ఇంతకు ముందు అతడి చిత్రాల హిందీ వెర్షన్స్ యూట్యూబ్ లో రికార్డు వ్వూస్ తెచ్చుకున్నాయి. ఆ క్రెడిట్ తోనే ‘పుష్ప’ చిత్రాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారని అర్ధమవుతోంది. దాదాపు రూ. 70కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారికి షాకిచ్చాడు బన్నీ. అందుకే అల్లు అర్జున్ ఇకపై కూడా  హిందీ మార్కెట్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు. 


బాలీవుడ్ తో పాటు కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ ప్రేక్షకులకు కూడా ‘పుష్ప’ బాగా నచ్చేసింది. దాంతో  రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప ది రూల్’ చిత్రంతో సౌత్ తో పాటు నార్త్ ను కూడా రూల్ చేస్తాడని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో బన్నీ ఇప్పుడు బాలీవుడ్ లో స్ర్కిప్ట్స్ వినే పనిలో బిజీగా ఉన్నాడట. నచ్చిన కొన్ని కథల్ని రిజెక్ట్ చేసి.. బాలీవుడ్ లో బెస్ట్ లాంచింగ్ దొరికే కథల గురించి అన్వేషిస్తున్నాడట. తదుపరిగా ఏ సినిమా చేసినా.. తెలుగు, హిందీ వెర్షన్స్ లోనే చేయాలని ఫిక్సయిపోయాడట. ఇప్పటికే పాన్ ఇండియా విజయాలు అందుకున్న ప్రభాస్, యశ్ లాంటి హీరోలంతా తదుపరి చిత్రాల్ని పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేసుకుంటున్నారు.  రామ్ చరణ్ కూడా ఆ బాటలోనే నడుస్తున్నాడు. ఇప్పుడు వీరి లిస్ట్ లోకి  అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. మరి బన్నీని బాలీవుడ్ లో హీరోగా లాంఛ్ చేసే దర్శక, నిర్మాతలు ఎవరవుతారో చూడాలి.    

Updated Date - 2022-01-06T17:40:27+05:30 IST