Allu Arjun: విజ‌య్ సేతుప‌తి పాత్ర‌ను అల్లు అర్జున్ చేస్తున్నాడా?

ABN , First Publish Date - 2021-08-04T14:53:01+05:30 IST

విల‌క్ష‌ణ న‌టుడు ఓ త‌మిళ చిత్రంలో చేసిన పాత్ర‌ను తెలుగులో బ‌న్నీ చేయ‌బోతున్నాడంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌కీ ఏ సినిమా రీమేక్‌లో అల్లు అర్జున్ న‌టించ‌బోతున్నాడు అనే వివ‌రాల్లోకెళ్తే..

Allu Arjun: విజ‌య్ సేతుప‌తి పాత్ర‌ను అల్లు అర్జున్ చేస్తున్నాడా?

విల‌క్ష‌ణ న‌టుడు ఓ త‌మిళ చిత్రంలో చేసిన పాత్ర‌ను తెలుగులో బ‌న్నీ చేయ‌బోతున్నాడంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌కీ ఏ సినిమా రీమేక్‌లో అల్లు అర్జున్ న‌టించ‌బోతున్నాడు అనే వివ‌రాల్లోకెళ్తే.. త‌మిళంలో అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘ఓ మై క‌డ‌వులే’. దీన్ని తెలుగులో పి.వి.పి సినిమా, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ రీమేక్ చేస్తున్నారు. ఇందులో విశ్వ‌క్ సేన్‌, మిథిలా పాల్క‌ర్ న‌టిస్తున్నారు. ‘ఓ మై క‌డ‌వులే’ సినిమాలో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఈ పాత్ర కోసం మేక‌ర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సంప్ర‌దిస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది. మ‌రి నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 

Updated Date - 2021-08-04T14:53:01+05:30 IST