బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న ‘ Pushpa Raj ’ .. ?

విభిన్న రకాల పాత్రలు పోషిస్తూ తన నటనతో అభిమానులను అలరిస్తున్న నటుడు అల్లు అర్జున్. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రంగస్థలం అనంతరం సుకుమార్ డైరెక్షన్‌లో రాబోతున్న సినిమా కావడంతో ట్రేడ్‌తో పాటు అభిమానుల్లోను మంచి అంచనాలున్నాయి. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్‌లో పుష్ప సినిమా విడుదలవుతోంది. క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 21న ఈ సినిమా థియేటర్లల్లో సందడి చేయబోతుంది.


సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో నిర్మాతలు ప్రమోషన్లను వేగవంతం చేశారు. ప్రమోషన్లల్లో భాగంగా బిగ్‌బాస్ -15లో ఐకాన్ స్టార్ పాల్గొనే అవకాశం ఉందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఐకాన్ స్టార్  పాల్గొంటే సినిమాకు మంచి లాభం చేకూరుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఒకవేళ సల్మాన్‌తో కలిసి అల్లు అర్జున్ స్టేజ్‌ను పంచుకుంటే బిగ్ బాస్-15లో ప్రమోషన్ చేసిన మొదటి పాన్ ఇండియా చిత్రంగా ఇది నిలుస్తుంది. అభిమానులందరూ ఈ పుకార్లు నిజం కావాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే బుల్లితెరపై ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు స్టార్ హీరోలను చూసే  అవకాశం లభిస్తుంది. పుష్ప సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ పాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.