Allari Naresh : మళ్ళీ నిర్మాణ రంగంలోకి ?

ABN , First Publish Date - 2022-08-17T19:30:55+05:30 IST

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఈవివి సత్యనారాయణ స్టార్ డైరెక్టర్‌గా చక్రం తిప్పారు. అప్పట్లోని అగ్ర కథానాయకులందరితోనూ సినిమాలు తెరకెక్కించారు. కేవలం కామెడీ చిత్రాలే కాకుండా.. వివిధ జోనర్స్‌లో గుర్తుండిపోయే సినిమాలు తీశారు.

Allari Naresh : మళ్ళీ నిర్మాణ రంగంలోకి ?

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఈవివి సత్యనారాయణ (EVV Satyanarayana) స్టార్ డైరెక్టర్‌గా చక్రం తిప్పారు. అప్పట్లోని అగ్ర కథానాయకులందరితోనూ సినిమాలు తెరకెక్కించారు. కేవలం కామెడీ చిత్రాలే కాకుండా.. వివిధ జోనర్స్‌లో గుర్తుండిపోయే సినిమాలు తీశారు. ఇక ఆయన దర్శకుడిగానే కాకుండా.. నిర్మాతగానూ సక్సెస్ ఫుల్ జెర్నీ చేశారు. ‘చాలా బాగుంది’ (Chalabagundi) చిత్రంతో ఇవివి నిర్మాణ రంగంలోకి దిగారు. ఇవివి సినిమా బ్యానర్‌పై ఆయన నిర్మించిన ఈ తొలి చిత్రం సూపర్ హిట్ అవడమే కాకుండా.. నటుడిగా యల్బీ శ్రీరామ్ కు కొత్త జీవితాన్నిచ్చింది.


తర్వాత ఇవివి సినిమా (Evv cinema) బ్యానర్‌పై వరుసగా.. ‘మా ఆవిడమీదొట్టు మీ ఆవిడ చాలామంచిది, తొట్టిగ్యాంగ్, నువ్వంటే నాకిష్టం, ఆరుగురు పతివ్రతలు, కితకితలు, అత్తిలి సత్తిబాబు, ఫిట్టింగ్ మాస్టర్’ లాంటి సినిమాలు రూపొందగా.. వాటిలో చాలా వరకూ చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. నిజానికి పరాజయాల్లో ఉన్న ఈవివిని ఈ బ్యానరే  మళ్ళీ నిలబెట్టింది. ఈవివి చనిపోయాకా.. ఆ సంస్థ పేరు మీద మంచి సినిమాలు తీయాలని అల్లరి నరేశ్ (Allari Naresh) కంకణం కట్టుకున్నాడు. ఆ బ్యానర్‌‌లో తను నిర్మాతగా తీసిన మొదటి సినిమా ‘బందిపోటు’ డిజాస్టర్ అవడంతో .. నరేశ్ చాలా నష్టపోయాడు. ఆ దెబ్బతో అతడు మళ్ళీ నిర్మాణం జోలికి పోలేదు. 


ఇప్పుడు అల్లరి నరేశ్ కు మళ్ళీ ఇవివి బ్యానర్ ను తిరిగి యాక్టివేట్ చేయాలనే ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది.  ఓటీటీల రూపంలో మరో చక్కటి వేదిక దొరికింది కాబట్టి.. ఇప్పుడు చిత్ర నిర్మాణం మరింత సౌలభ్యంగా మారింది. అందుకే నరేశ్ ఈవివి సినిమాస్ బ్యానర్ పై మళ్ళీ సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నట్టు టాక్. ఈ సారి నిర్మాణ బాధ్యతలు అన్న ఆర్యన్ రాజేశ్ చేపట్టబోతున్నాడు. ప్రస్తుతం ఒక స్ర్కిప్ట్‌ను నరేశ్ లాక్ చేశాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చు. ఈ ప్రయత్నం విజయవంతమైతే.. ఇక నుంచి తమ సొంతబ్యానర్ లో ఏడాదికి ఒక సినిమా, ఓ వెబ్ సిరీస్ చేయాలని భావిస్తున్నాడట అల్లరి నరేశ్. 

Updated Date - 2022-08-17T19:30:55+05:30 IST