తమిళ దర్శకుడితో అల్లరి నరేశ్ ?

మహేశ్ ‘మహర్షి, నాంది’ చిత్రాలతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు అల్లరి నరేశ్. ఈ రెండు సినిమాల్లో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అతడు.. ప్రస్తుతం పలు చిత్రాలకు కమిట్ అయ్యాడు.  కానీ ఇంత వరకూ ఏ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. నిజానికి మహేశ్ కోనేరు నిర్మాణంలో ‘సభకు నమస్కారం’ చిత్రం  షూటింగ్ ఎప్పుడో మొదలవ్వాలి. సతీశ్ మల్లంపాటి ఈ సినిమాకి దర్శకుడు. అయితే మహేశ్ కోనేరు హఠాన్మరణంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. ఈ ప్రాజెక్ట్ ను వేరే నిర్మాతలు టేకప్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. అల్లరి నరేశ్ తాజాగా ఓ తమిళ దర్శకుడితో  వెరైటీ సినిమా చేయబోతున్నట్టు సమాచారం.


రాజమోహన్ అనే కొత్త దర్శకుడు ఇటీవల నరేశ్‌కు ఓ స్టోరీ వినిపించాడట. చాలా డిఫరెంట్‌గా ఉండడంతో పాటు, తను ఇదివరకు ఎన్నడూ చేయని పాత్ర అవడంతో నరేశ్, ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.  ప్రముఖ రచయిత అబ్బూరి రవి ఈ ప్రాజెక్ట్ ను అల్లరి నరేశ్ దగ్గరకి తీసుకొచ్చాడట. దీనికి నిర్మాత ఇంకా ఎవరూ ఫిక్స్ అవలేదు. కానీ ప్రాజెక్ట్ మాత్రం పక్కా అంటున్నారు. త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన రానుంది. ఒకవేళ ‘సభకు నమస్కారం’ చిత్రం సెట్స్ పైకి వెళ్ళడం లేటయితే.. ఈ సినిమానే తెరకెక్కే అవకాశాలున్నాయి. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.