'అహం బ్రహ్మస్మి' లో అల్లరి నరేష్..?

ABN , First Publish Date - 2021-08-03T19:54:08+05:30 IST

మంచు మనోజ్ నటిస్తున్న తాజా చిత్రం 'అహం బ్రహ్మస్మి'. ఈ సినిమాలో హీరో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు నెట్టింట వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఎం.ఎం ఆర్ట్స్ బ్యానర్‌పై మంచు మనోజ్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

'అహం బ్రహ్మస్మి' లో అల్లరి నరేష్..?

మంచు మనోజ్ నటిస్తున్న తాజా చిత్రం 'అహం బ్రహ్మస్మి'. ఈ సినిమాలో హీరో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు నెట్టింట వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఎం.ఎం ఆర్ట్స్ బ్యానర్‌పై మంచు మనోజ్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గతఏడాది ప్రారంభమైన చిత్ర షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయింది. సినిమాలన్ని ఇటీవల మళ్ళీ ఒక్కొక్కటిగా సెట్స్ మీదకి వస్తున్నాయి. కానీ మనోజ్ 'అహం బ్రహ్మస్మి'కి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే తాజాగా ఇందులో ఓ కీలక పాత్ర కోసం అల్లరి నరేశ్‌ని తీసుకున్నారట. ఇంతకముందు మెగా మేనల్లుడు సాయి తేజ్ ఈపాత్రలో నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అల్లరి నరేశ్ పేరు వినిపిస్తోంది. మరి వీరిద్దరిలో ఎవరు నటిస్తారనేది మేకర్స్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. నరేశ్ హీరోగా నటిస్తూనే, కీల పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే 'గమ్యం', 'శంభో శివ శంభో', 'మహర్షి' వంటి సినిమాలలో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. 

Updated Date - 2021-08-03T19:54:08+05:30 IST