ఇంట గెలిచిన అలియాభట్ రచ్చ గెలవాలనుకుంటున్నారు. తన హాలీవుడ్ కలల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌పై తనదైన ముద్రవేసిన అలియా తన తదుపరి గమ్యంగా హాలీవుడ్ చిత్రాల్లో రాణించాలని భావిస్తున్నారు. దీని కోసం అలియాభట్ డబ్ల్యూఎంఈ అనే హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రియాంక చోప్రా బాటలోనే అలియా హాలీవుడ్లో తన హవా చూపిస్తుందా అంటే వేచి చూడాలి. ప్రస్తుతం అలియాభట్ ‘ఆర్ఆర్ఆర్’, ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’ చిత్రంలో నటిస్తున్నారు. ‘డ్రీమ్స్’ చిత్రంలో నటిస్తూ నిర్మిస్తున్నారు. ‘గంగూబాయ్ కతియావాడి’ చిత్రీకరణ పూర్తి చేశారు.