నీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే Alia Bhatt రెస్పాన్స్ ఇదీ.. నా హ్యాండ్‌బ్యాగ్‌లో అవెప్పుడూ ఉంటాయంటూ..

ABN , First Publish Date - 2022-02-20T15:26:09+05:30 IST

బాలీవుడ్‌ కథానాయికగా శిఖరాగ్ర స్థాయిలో ఉంది అలియా భట్‌. సంజయ్‌లీలా భన్సాలీ సినిమాలో ‘గంగూభాయ్‌’ అవతారం ఎత్తింది...

నీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే Alia Bhatt రెస్పాన్స్ ఇదీ.. నా హ్యాండ్‌బ్యాగ్‌లో అవెప్పుడూ ఉంటాయంటూ..

బాలీవుడ్‌ కథానాయికగా శిఖరాగ్ర స్థాయిలో ఉంది అలియా భట్‌. సంజయ్‌లీలా భన్సాలీ సినిమాలో ‘గంగూభాయ్‌’ అవతారం ఎత్తింది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో మన హీరోయిన్‌ అయిపోయింది. తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. తన జీవితం గురించి, ఇష్టాయిష్టాల గురించి, అభిరుచుల గురించి ఇటీవల అలియా ఏం చెప్పిందంటే..


ఎదుటి వ్యక్తిలో ఇష్టపడేది: నిజాయితీ. ఎంత సంపద, విద్వత్తు ఉన్నా, నిజాయితీ లేని మనుషుల దగ్గర క్షణం కూడా గడపలేను.


మగవాడు ఎదురు పడగానే: వాళ్ల కళ్లు చూస్తాను. పూర్తిగా కాకపోయినా.. ఎంతోకొంత క్యారెక్టర్‌ గెస్‌ చేయొచ్చు.


భయపడే విషయం: చీకటంటే భయం. అందుకే నా రూమ్‌లో లైట్లు ఆర్పను. కిటీకీ తలుపులు మూయను.


మీ బలహీనత: ఎవరైనా ఎదురైతే వాళ్ల పెర్‌ఫ్యూమ్‌ ఏమిటో చెక్‌ చేయడానికి వాసన చూస్తాను.


చనిపోయేలోగా చేయాలనుకునే పని: ప్రపంచం మొత్తం చుట్టేయాలి. నేను చూడని ఒక్క దేశం కూడా ఉండకూడదు.


లాక్‌ డౌన్‌లో నేర్చుకున్న కళ: గిటార్‌ నేర్చుకున్నా. ఇప్పుడు బాగా ప్లే చేయగలను. స్ర్కీన్‌ రైటింగ్‌ మెళకువలు తెలుసుకున్నా.


నిద్రపోయే ముందు చేసే పని: డైరీ రాయడం. ముఖ్యమైన విషయాలన్నీ నోట్‌ చేస్తా.


హ్యాండ్‌బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉండేవి: పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు. కచ్చితంగా నాలుగైనా ఉంటాయి.


చిన్న పిల్లలకు మీరిచ్చే సలహా: హ్యాండ్‌ రైటింగ్‌ మెరుగు పరచుకోండి. ఎందుకంటే నా చేతిరాత అంత బాగోదు.


నటిగా సవాలు విసిరిన సినిమా: ఉడ్తా పంజాబ్‌. ఆ షూటింగ్‌లో పరుగెడుతూనే ఉన్నా. చాలా దెబ్బలు కూడా తగిలాయి. నటన అంటే శారీరక శ్రమ అని ఆరోజే తెలిసింది. 


కెరీర్‌లో మర్చిపోలేని జ్ఞాపకం: నేనూ, రణబీర్‌ కపూర్‌ ఒకేసారి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకోవడం.


ఫేవరెట్‌ కో స్టార్‌: నాతో పనిచేసినవాళ్లంతా నాకు ఇష్టమైన వాళ్లే. ఒక్కరి పేరే చెప్పమంటే... షారుక్‌ ఖాన్‌.


జీవిత లక్ష్యం: ఆస్కార్‌ సాధించడం. కానీ అదెలాగో నాకు ఇప్పటికీ తెలీదు. 


ఇష్టమైన హాబీ: పుస్తకాలు చదువుతా. రోజుకి కనీసం పది పేజీలు తిప్పకపోతే నాకు నిద్ర పట్టదు. ‘వెన్‌ బ్రీత్‌ బికమ్స్‌ ఎయిర్‌’ నా ఫేవరెట్‌ బుక్‌.


ప్రభావితం చేసిన వ్యక్తులు: మా అమ్మానాన్న. జీవితాన్ని వాళ్లు చూసే దృక్పథం నాకు బాగా నచ్చుతుంది. 


ఇష్టమైన వంటకం: పప్పన్నం ఇష్టం. పిజ్జా అంటే మరీ ఇష్టం. బంగాళదుంపతో ఏం చేసినా ఇష్టంగా తింటాను.


స్కూలు రోజుల్లో ఇష్టమైన వ్యాపకం: లంచ్‌ టైమ్‌లో గుంపుగా కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లం. మా స్నేహితుల జీవితాల్లోని సీక్రెట్స్‌ అన్నీ అప్పుడే తెలిసేవి.


ఫేవరెట్‌ గీతం: లతాజీ పాడిన ‘లగ్‌ జా గలే..’. ప్రతీరోజూ ఈ పాట వింటూనే ఉంటాను. ఈ పాట వింటే వేరే లోకాల్లోకి వెళ్లిపోతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. 


వెండి తెరపై అద్భుతంగా కనిపించే జోడీ:  షారుఖ్‌ - కాజల్‌. వారిద్దరి కెమిస్ర్టీ అద్భుతంగా ఉంటుంది.


మీకూ, రణబీర్‌కపూర్‌కూ ఉన్న కామన్‌ ఇష్టం: ఇద్దరికీ 8 అంకె అంటే చాలా ఇష్టం. ఇద్దరి మెయిల్‌ ఐడీలో 8 ఉంటుంది. 


మీ గురించి రణబీర్‌కున్న అభిప్రాయం: తనకంటే నాకే ఎక్కువ విషయాలు తెలుసు అనుకుంటాడు. నేనేం మాట్లాడినా ‘క్లాస్‌ తీసుకుంటావేంటి’ అనేట్టు చూస్తాడు.


పెళ్లెప్పుడు: కరోనా రాకపోయి ఉంటే ఈపాటికి అయిపోయేది. ఏం జరిగినా మన మంచికే కదా..? అయితే నా దృష్టిలో రణబీర్‌తో నా పెళ్లెప్పుడో అయిపోయింది. మానసికంగా ఇద్దరం భార్యాభర్తలమే.

Updated Date - 2022-02-20T15:26:09+05:30 IST