ఆలియాభట్‌ పెళ్లి.. మళ్లీ వాయిదా?

ABN , First Publish Date - 2021-11-29T21:47:40+05:30 IST

బాలీవుడ్‌ ప్రేమపక్షులు రణబీర్‌ కపూర్‌, ఆలియాభట్‌ల పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎదురుచూసే కొద్దీ పెళ్లి వెనక్కి వెళ్తూనే ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ డిసెంబర్‌లో ఈ జంట ఒకటి కావల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఏప్రిల్‌–మే నెలలో జరగనుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. అయితే మరోసారి ఈ జంట పెళ్లి వాయిదా పడిందని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆలియాభట్‌ పెళ్లి.. మళ్లీ వాయిదా?

బాలీవుడ్‌ ప్రేమపక్షులు రణబీర్‌ కపూర్‌, ఆలియాభట్‌ల పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎదురుచూసే కొద్దీ పెళ్లి వెనక్కి వెళ్తూనే ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ డిసెంబర్‌లో ఈ జంట ఒకటి కావల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఏప్రిల్‌–మే నెలలో జరగనుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. అయితే మరోసారి ఈ జంట పెళ్లి వాయిదా పడిందని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం ఈ జంట పెళ్లి తంతును మరో ఏడాది వాయిదా వేశారని తెలుస్తోంది. 


బిజీ షెడ్యూల్స్‌, ఇతర కారణాలతో వచ్చే ఏడాది డిసెంబర్‌లో పెళ్లి డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నారట ఆలియా – రణ్‌బీర్‌. అయితే ఇద్దరు కమిట్‌ అయిన సినిమాలు పూర్తి చేసి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారట. విదేశాల్లో పెళ్లి అంటే ముందు నుంచే ప్రణాళికలు ఉండాలి కాబట్టి.. అన్ని పనులు పూర్తి చేసి కొంత వెకేషన్‌ తీసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోనున్నారట. పెళ్లి వాయిదాకు మరో కారణం కూడా ఉంది. ఆలియాభట్‌ – రణ్‌బీర్‌ కపూర్‌ ఇద్దరూ కలల భవంతి వచ్చే ఏడాది మధ్యలో పూర్తి అవుతుందట. అది పూర్తయ్యాక  ఇద్దరూ వివాహబంధంతో ఒకటి కానున్నారని సమాచారం. 


Updated Date - 2021-11-29T21:47:40+05:30 IST