RRR: కొన్ని నిమిషాల పాత్రలకి అలియా, అజయ్ దేవ్‌గణ్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా..

‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. అందుకే దాదాపు మూడేళ్ల తర్వా చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీని సైతం ఆ లెవల్‌లోనే తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్రల్లో ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా బాలీవుడ్ నటి అలియా భట్ చేస్తుండగా.. స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు.


ఈ స్టార్ నటీనటులు ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల హిందీ ప్రేక్షకుల్లో రీచ్ ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. అందుకే కొన్ని నిమిషాలు మాత్రమే ఉండే వీరిద్దరికీ కోట్లలో పారితోషికం ముట్టజెప్పిందటా ఈ చిత్రబృందం. ఈ మూవీలో కేవలం 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందని సమాచారం. దీని కోసం ఈ బ్యూటీ దాదాపు 9 కోట్ల రూపాయలు తీసుకుందటా. 


బాలీవుడ్‌లో మంచి స్టార్ డమ్ ఉన్న అజయ్ దేవ్‌గణ్ ఈ సినిమాకి కేటాయించింది కేవలం 7 రోజుల కాల్షీట్లు మాత్రమేనటా. దాని కోసం దాదాపు 35 కోట్లు ఛార్జ్ చేశాడటా. ఈయనది చాలా చిన్న రోల్ అయినప్పటికీ ఎంతో కథకి ఎంతో కీలకమైన పాత్ర అని టాక్. 


నిజానికి జనవరి 7నే విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ ప్రభావంతో వాయిదా పడింది. ముఖ్యంగా కలెక్షన్స్ బాగా వచ్చే మెట్రోపాలిటన్ సిటీస్‌లో కేసులు పెరుగుతున్న ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలు ఆంక్షలు సైతం విధిస్తున్నాయి. ఢిల్లీలో అయితే థియేటర్స్‌ని పూర్తి బంద్ చేయించింది అక్కడి ప్రభుత్వం. కాగా, ఇప్పటి వరకైతే మరో విడుదల తేదినైతే ప్రకటించలేదు మూవీ టీం.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.