'హీరా మండి'లో రోల్ అడిగిన ఆలియా..బన్సాలీ ఏమన్నారంటే..?
ABN , First Publish Date - 2021-08-11T16:39:29+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ హిందీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'హీరా మండి'లో ఓ రోల్ ఇవ్వమని దర్శక దిగ్గజం సంజయ్ లీలా బన్సాలీని అడిగారట. స్టార్ హీరోయిన్స్ సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ హిందీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'హీరా మండి'లో ఓ రోల్ ఇవ్వమని దర్శక దిగ్గజం సంజయ్ లీలా బన్సాలీని అడిగారట. స్టార్ హీరోయిన్స్ సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ కోసం బన్సాలీ ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. వెబ్ సిరీస్ అయినా బన్సాలీ ప్రాజెక్ట్ కాబట్టి ఆలియా ఇందులో నటించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు ఇందులో రోల్ చేసినందుకు రెమ్యునరేషన్ కూడా వద్దని ఆయనకి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఆయన మాత్రం ఫ్రీగా ఏమీ వద్దు ..ఇప్పుడు నీకున్న మార్కెట్‌ను బట్టే రెమ్యునరేషన్ తీసుకోమని అన్నారట.
అంటే ఆలియాకి 'హీరా మండి'లో క్యారెక్టర్ ఫిక్సైనట్టే. కాగా, ఆలియా.. బన్సాలీ దర్శకత్వంలో 'గంగూభాయ్ కతియావాడి' సినిమాలో నటించారు. త్వరలో ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ - యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా.. ఓలివియా మోరీస్, అజయ్ దేవగన్, సముద్ర ఖని, శ్రియ శరణ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో జరుగుతుండగా, ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13న రిలీజ్ కానుంది.
