ముంబైలో 'సలార్' ..ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసిన శృతి

'కేజీఎఫ్' సినిమాలతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో 'సలార్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబైలో మొదలైంది. గతనెల హైదరాబాద్‌లో ఓ లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్రబృందం అక్కడ ప్యాకప్ చెప్పేసి ఏమాత్రం గ్యాప్ లేకుండా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టగా, ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న శృతి హాసన్ కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ చిన్న వీడియోను షేర్ చేసి తెలిపారు. "నా ఫేవరెట్ దర్శకులలో ఒకరైన ఫిల్మ్ మేకర్‌కి విసుగు తెప్పించడం నాకు చాలా ఇష్టం".. అంటూ శృతి హాసన్ షేర్ చేసిన వీడియోకు ఓ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2022, ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, కన్నడ, భాషలతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.   


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.